Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నా రక్తంలో క్రికెట్, నా భర్త.. కుటుంబం: సానియా మీర్జా

Posted by:
Published: Monday, September 21, 2015, 12:39 [IST]

ముంబై: క్రికెట్ తన రక్తంలోనే ఉందని భారత టెన్నిస్‌ తార సానియా మీర్జా అన్నది. తమ తాతల కాలం నుంచి తమ కుటుంబంలో ప్రతి ఒక్కరు క్రికెట్‌ ఆట ఆడినవారేనని చెప్పింది. ఆదివారం క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గౌరవ జీవితకాల సభ్యత్వాన్ని ఆమె స్వీకరించింది.

ఈ సందర్భంగా మాట్లాడింది. తన భర్త షోయబ్‌ మాలిక్‌ క్రికెటరేనని చెప్పింది. అలాగే, తన తండ్రి కూడా క్రికెట్‌ ఆడేవాడని, తన అంకుల్‌ రంజీ మ్యాచ్‌లు ఆడాడని చెప్పింది. తన రక్తంలోనే క్రికెట్‌ ఉందని పేర్కొంది. సీసీఐలో తాను కూడా కొన్ని టోర్నీలు (టెన్నిస్) కూడా ఆడానంది. మళ్లీ ప్రాక్టీస్ కోసం రావాలని ఉందని చెప్పింది.

Cricket is in my blood: Sania Mirza

భారత మాజీ కెప్టెన్‌ గులామ్‌ అహ్మద్‌ తనకు బంధువు అవుతాడని చెప్పింది. ఆయన తనకు తాతయ్య అవుతాడంది. టెన్నిస్‌ గురించి మాట్లాడుతూ.. తాను డబుల్స్‌ ఫార్మాట్‌ మాత్రమే ఆడుతున్నానని, శారీరకంగా అది నాకు అనుకూలమేనని చెప్పింది.

కానీ మానసికంగా చాలా శ్రమించాలని, ఏడాదిలో ఇరవై అయిదు వారాలు అత్యుత్తమంగా ఆడాలంటే మాటలు కాదని చెప్పింది. కార్యక్రమం అనంతరం ఆమె చైనాకు బయల్దేరింది. సోమవారం ప్రారంభమయ్యే గాంగ్‌జౌ మహిళల ఓపెన్‌లో మార్టినాతో కలిసి ఆడనుంది.

English summary
“Everyone in my family plays cricket. So cricket is in my blood. When I was very young, I have played a few (tennis) tournaments at the CCI courts, and I would want to come here again to practice, hit a few balls and watch some cricket as well,” said Sania, hours before leaving for China for the Guangzhou International Women’s Open tennis tournament.
మీ వ్యాఖ్య రాయండి