Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తీరనిలోటు: దాల్మియా మృతిపై ప్రణబ్, మోడీ, సచిన్

Published: Monday, September 21, 2015, 12:35 [IST]

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) మృతిపట్ల ప్రముఖులు, బోర్డు సభ్యులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఇతర ప్రముఖులు దాల్మియా మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

కోల్‌కతా‌లోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

'ఈ దు:ఖ సమయంలో దాల్మియా కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా' అని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

'జూన్‌లో దాల్మియాను కలిశా. అదే ఆఖరి సారి అవుతుందని మాత్రం అనుకోలేదు. ఆయన నాకు అందించిన ప్రోత్సాహన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా'అని సచిన్‌ పేర్కొన్నారు.
'దాల్మియా మరణ వార్త విషాదం నింపింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలి' అని మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

 Mukherjee, Modi, Sachin condole Dalmiya's death

'దాల్మియాతో నాకు 15ఏళ్ల అనుబంధం ఉంది. నాతో పాటు చాలా మందికి ఆయన మార్గనిర్దేశకుడు. ఆయన ఆటను ఎంతో ప్రేమించేవారు. దేశానికి చెందిన ఓ గొప్ప క్రికెట్ నిర్వాహకుడిని మనం కోల్పోయాం. భారత క్రికెట్ తో పాటు వ్యక్తిగతంగా నాకూ ఇది తీరని లోటు' అని బిసిసిఐ కార్యదర్శి, కోశాధికారి అనురాగ్ ఠాకూర్ సంతాపం తెలిపారు.

'జగ్‌మోహన్‌ మృతి వార్త విన్నాక బాధగా ఉంది. క్రీడాపాలకుల్లో ఆయనో శిఖరం. బంగాల్‌కు నిజమైన ప్రేమికుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి' అని పశ్చిమబెంగాల్ సిఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. 'దాల్మియా మృతి క్రికెట్‌ రంగానికి తీరని లోటు. ఆయన భారత క్రికెట్‌తోపాటు.. అంతర్జాతీయ క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేశారు' అని ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

English summary
President Pranab Mukherjee and Prime Minister Narendra Modi on Sunday condoled the death of BCCI president Jagmohan Dalmiya.
మీ వ్యాఖ్య రాయండి