Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‍‌ని యాచించం, రాజకీయాలతో ముడి: షహర్యార్

Posted by:
Published: Wednesday, September 23, 2015, 11:43 [IST]

కరాచీ: భారత్ - పాకిస్తాన్ సిరీస్ కోసం తాము ఇండియాను ఏం యాచించడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నాడు. భారత్‌తో డిసెంబర్‌లో తమ జట్టు సిరీస్‌ ఆడడం కష్టమేనని చెప్పాడు.

భారత ప్రభుత్వం నుంచి అనుమతి కోసం బీసీసీఐ ఇంకా ఎదురుచూస్తోందన్నాడు. భారత్‌కు హెచ్చరిక జారీ చేయాలనుకోవట్లేదని, భారత్‌తో సిరిస్‌ జరిగే అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయన్నాడు. భారత్‌ రాజకీయాలకు, ఆటకు ముడిపెడుతోందన్నాడు.

Pakistan Will not Beg India for Cricket Series: Shaharyar

గత ఏడాది పీసీబీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత్‌ యూఏఈలో ఆతిథ్య పాకిస్తాన్‌తో డిసెంబరులో టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడాల్సి ఉందని, ఇక బంతి భారత్‌ కోర్టులోనే ఉందని షహర్యార్‌ ఖాన్ మంగళవారం చెప్పాడు.

English summary
Pakistan Cricket Board chairman Shahryar Khan fears chances of a series against India in December are slim as the Indian board is still waiting to get clearance from its government.
మీ వ్యాఖ్య రాయండి