Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఉపఖండ ప్రతిష్ట పెంచారు: దాల్మియాపై పాక్ మాజీ కెప్టెన్

Posted by:
Published: Thursday, September 24, 2015, 13:29 [IST]

ముంబై: దివంగత బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహాన్ దాల్మియాపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ప్రశంసలు కురిపించాడు. జగ్మోహాన్ దాల్మియా హఠాన్మరణంపై సంతాపం ప్రకటించిన జావేద్ మియాందాద్ ఆయన సేవలను కొనియాడారు.

ప్రపంచ క్రికెట్‌లో భారత్ ఉపఖండం ప్రతిష్ట దాల్మియా మరింతగా ఇనుమడింపజేశారని పీటీఐ పత్రికతో పేర్కొన్నాడు. ‘‘క్రికెట్‌కు తీరని లోటు మిగిల్చి దాల్మియా వెళ్లిపోయారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉపఖండ ప్రతిష్ఠను పెంచినవాడిగా దాల్మియాను అందరూ గౌరవిస్తారు. దాల్మియా పాక్ క్రికెట్‌కు నిజమైన స్నేహితుడిగా నిలిచారు'' అని మియాందాద్ తెలిపారు.

Jagmohan Dalmiya’s passing away has left a big void in cricket: Javed Miandad

1999లో జావేద్ మియాందాద్ పాకిస్థాన్ జట్టు కోచ్‌గా భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహాన్ దాల్మియా అద్భుతమైన అతిథి సత్కారాలు చేశారని కొనియాడారు.

కోల్‌కత్తాలోని కేఎం బిర్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం జగ్మోహాన్ దాల్మియా మరణించిన సంగతి తెలిసిందే. భారత్-పాక్ జట్ల మధ్య క్రికెట్ తోడ్పాడుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఇందుకు నిదర్శనం 1999, 2004లో జరిగిన సిరిస్‌లే ఉదాహారణగా చెప్పారు.

English summary
Former Pakistan captain Javed Miandad has paid homage to the late Jagmohan Dalmiya, saying he was someone who had a lot of respect for Pakistani cricket and cricketers.
మీ వ్యాఖ్య రాయండి