Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ ట్రస్ట్‌కు రూ.20లక్షలు ఇచ్చిన హెల్ప్ ఫర్ హీరోస్

Posted by:
Published: Thursday, September 24, 2015, 9:53 [IST]

న్యూఢిల్లీ: భారత వన్డే, టీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ట్రస్ట్‌కు రూ.20లక్షల మొత్తాన్ని 'హెల్ప్ ఫరా హీరోస్' అనే స్వచ్చంద సేవా సంస్థ అందజేసింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు సమీకరించేందుకు ఇటీవల ''క్రికెట్‌ ఫర్‌ హీరోస్‌'' పేరుతో లండన్‌లో మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.

మహేంద్ర సింగ్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్‌, మహేల జయవర్ధనె, బ్రెండన్ మెక్‌కలమ్‌, హెడెన్‌, స్ట్రాస్‌ లాంటి స్టార్లు ఇందులో పాల్గొన్నారు.

MS Dhoni earns Rs.20 lakh for Indian Army with heroics in charity match

ఈ మ్యాచ్‌ ద్వారా రూ.3కోట్ల నిధులు హెల్ప్‌ ఫర్‌ హీరోస్‌ సంస్థకు సమకూరాయి. ఇందులో నుంచి కొంత నగదును ధోని ట్రస్ట‌కు కూడా ఇచ్చింది ఆ సంస్థ. తమకు అందిన ఈ మొత్తాన్ని ధోని ట్రస్ట్ భారత సైన్యానికి అందించనుంది.

హెల్ప్ ఫర్ హీరోస్ సంస్థ టీ 20ని గాయపడ్డ బ్రిటిష్ సైనికుల కోసం నిర్వహించింది. రెండు జట్లు మ్యాచ్ ఆడాయి. హెల్ప్ ఫర్ హీరోస్ ఎలెవన్, రెస్టా ఆప్ ధి వరల్డ్ ఎలెవన్ టీంలు మ్యాచ్ ఆడాయి. ధోనీ తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.

English summary
For the feat of smashing the winning runs in the Help for Heroes charity match last week, MS Dhoni’s Charitable Foundation has been given 20,000 pounds out of the 300,000 raised in the course of the match – an amount which translates to a little more than Rs. 20 lakhs.
మీ వ్యాఖ్య రాయండి