Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కాల్ చేస్తే స్పందించని ఇషాంత్: రంజీలో పక్కనెట్టేశారు

Published: Thursday, September 24, 2015, 9:36 [IST]

న్యూఢిల్లీ: దేశవాళీ రంజీ జట్లలో టీమిండియా ఆటగాళ్లకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా టీమిండియా సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపిక విషయంపై మాట్లాడటానికి సెలెక్టర్లు ఫోన్‌ చేస్తే ఇషాంత్ ఫోన్ ఎత్తలేదు.

మెసేజ్‌లు పంపినా బదులివ్వ లేదు. దీంతో సెలెక్టర్లు అతనికి ఢిల్లీ రంజీ జట్టులో చోటు కల్పించలేదు. ఈ విషయాన్ని ఢిల్లీ సెలెక్టర్‌ వినయ్‌ లాంబా తెలిపాడు. కాగా, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లలోనూ ఇషాంత్‌కు బెర్త్‌ దక్కలేదు.

ఇక ఒక టెస్ట్‌ నిషేధం కారణంగా సఫారీలతో తొలి మ్యాచ్‌కు కూడా అతను అందుబాటులో ఉండడు. కాగా, ఆల్‌రౌండర్‌ రజత్‌ భాటియాను పక్కనపెట్టడం కూడా వివాదాస్పదమైంది. వచ్చే నెల ఒకటి నుంచి రంజీ సీజన్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

 Ranji Trophy: Delhi squad announced; no place for Ishant Sharma

అయితే, సౌతాఫ్రికాతో అక్టోబర్ 14 నుంచి జరిగే రెండోటెస్ట్ వరకు ఇషాంత్‌కు విరామ సమయం ఉంటుంది. ఆలోపు చక్కగా ఓ రెండు రంజీ మ్యాచ్‌ల ద్వారా ఫాంను కాపాడుకునే అవకాశాన్ని కోల్పోయాడు ఇషాంత్.

కాగా, ‘ఇషాంత్‌ను సంప్రదించేందుకు మేం ప్రయత్నించాం. అయితే ఫోన్ కాల్స్‌కి గానీ, మేం పంపిన మెసేజ్‌లకు గానీ అతను బదులివ్వలేదు. ఇషాంత్‌పై ఒక టెస్ట్ మ్యాచ్ నిషేధం ఉన్న సంగతి తెలుసు. అయితే, ఈ సమయంలో అతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడొచ్చా లేదా? అనేది మాకు తెలియదు. ఒకవేళ ఆతనికి అనుమతి ఉంటే, ఇప్పటికైనా అతణ్ని ఆడించేందుకు సిద్ధం' అని వినయ్ అన్నారు.

ఢిల్లీ జట్టు: గౌతమ్ గంభీర్ (కెప్టెన్), ఉన్ముక్త్ చంద్ (వైస్-కెప్టెన్), వైభవ్ రావల్, మిలింద్ కుమార్, నితీష్ రానా, యోగేష్ నగర్, మన్నన్ శర్మ, పుల్కిత్ నారంగ్, సుమీత్ నర్వాల్, పవన్ సూయల్, సారంగ్ రావత్, ప్రదీప్ సంగ్వాన్, పర్వీందర్ అవాన, మోహిత్ ఆహ్లావాట్ (వికెట్ కీపర్), ధృవ్ షోరే. పవన్ నెగి, వికాస్ టోకాస్, సుబోధ్ భాతి, రిషబ్ పంత్. చీఫ్ కోచ్ అజయ్ జడేజా.

English summary
On a day when left-arm spinner Pawan Negi got his maiden call-up in the India A squad for the upcoming T20 match against South Africa, the Delhi selectors and Gautam Gambhir did not find him good enough to be kept in the squad of 15 for the Ranji Trophy opener against Rajasthan.
మీ వ్యాఖ్య రాయండి