Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

విడుదల కానీ సినిమా చూసిన టీమిండియా ఆటగాళ్లు

Published: Friday, September 25, 2015, 15:03 [IST]

బెంగళూరు: దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న సుదీర్ఘ సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే వన్డే, టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించింది. దీంతో మైదానంలోకి దూకేసిన క్రికెటర్లు కఠోర సాధన చేస్తున్నారు.

వన్డే, ట్వంటీ20 ఫార్మాట్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో పాటు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, హర్భజన్ సింగ్ సహా జట్టుకు ఎంపికైన సభ్యులంతా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ప్రాక్టీస్ సెషన్లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.

అయితే గురువారం జట్టు సభ్యులందరూ కాస్తంత విశ్రాంతి తీసుకున్నారు. ‘కామెడీ నైట్స్ విత్ కపిల్' టీవీ షోతో సెలబ్రిటీగా మారిన కపిల్ శర్మ ప్రధాన పాత్రధారిగా బాలీవుడ్ లో ‘కిస్ కిస్ సే ప్యార్ కరూ' చిత్రం రూపొందింది. ఈ చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని శుక్రవారం విడుదలైంది.

Dhoni, Raina, Harbhajan and others watch 'Kis Kisko Pyaar Karoon' in Bengaluru

కాగా, గురువారమే బెంగళూరులో టీమిండియా క్రికెటర్ల కోసం చిత్ర నిర్మాతలు ఈ చిత్రం ప్రివ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ధోనీ సహా మిగిలిన క్రికెటర్లంతా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారు.

దశాబ్దం తర్వాత జార్ఖండ్‌కు ధోనీ

ఓ ఫార్మాట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కొంత తీరిక కుదుర్చుకున్న టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ ధోనీ ఈ సమయాన్ని దేశవాళీ క్రికెట్‌తో భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. పదేళ్ల తర్వాత తన రాష్ట్ర జట్టు జార్ఖండ్ తరఫున వచ్చే సీజన్‌లో ఆడనున్నాడు. రంజీల్లో, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో ధోనీ తన జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ప్రాక్టీస్‌లో భాగంగానే ఈ నిర్ణయం ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ధోనీ చివరిసారిగా ఓ దేశవాళీ టోర్నీలో ఆడి ఆరేళ్లు అవుతోంది. సాల్వే ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా రెడ్‌తో మ్యాచ్‌లో బ్లూ తరఫున ఆడాడు. ధోనీ జార్ఖండ్ తరఫున చివరిసారిగా 2005 మార్చిలో చండీగఢ్‌తో మ్యాచ్‌లో ఆడాడు.

English summary
Captain MS Dhoni, Suresh Raina, Ajinkya Rahane, Harbhajan Singh and other Indian cricketers took time off from the preparatory camp to watch a movie here on Thursday night (September 24).
మీ వ్యాఖ్య రాయండి