Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'ప్రపంచ క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌లో ధోనీ ఒకడు'

Posted by:
Published: Friday, September 25, 2015, 18:28 [IST]

బెంగుళూరు: టీమిండియా వన్డే కెప్టెన్, ట్వంటీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి శుక్రవారం ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని కితాబిచ్చాడు. ధోనీ సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడతాయని చెప్పాడు.

అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో సిరిస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌పై ఒత్తిడి పెరుగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు కామెంట్లు చేసిన నేఫథ్యంలో జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి శుక్రవారం మీడియాతో ముచ్చటించారు.

MS Dhoni is 'one of the all-time greats in world cricket': Ravi Shastri

ప్రపంచ క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ధోనీ కూడా ఒకడని కితాబిచ్చాడు. ధోని సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడతాయని, అతని కెప్టెన్సీ అధ్బుతమని చెప్పుకొచ్చాడు. ధోని కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు తీసుకున్నాడు. కెప్టెన్సీ అనేది ధోనికి కొత్త కాదని పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ను ఒక ఛాంపియన్ కెప్టెన్ నాయకత్వంలో ఆడతామని చెప్పాడు. రానున్న నెలల్లో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడమే తమ లక్ష్యమని ఒక ప్రశ్నకు సమాధానంగా రవిశాస్త్రి తెలిపాడు.

టీమిండియా ఏ జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా తమ భవిష్యత్తు కార్యాచరణలో సాయపడటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు.

English summary
Indian Team Director Ravi Shastri today said that South Africa are still a formidable side despite the retirement of some big players recently but his side will continue their aggressive brand of cricket in the upcoming series beginning on October 2.
మీ వ్యాఖ్య రాయండి