Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దక్షిణాఫ్రికా సిరిస్: ధోని సేనకు ఆర్మీ తరహా శిక్షణ

Posted by:
Published: Monday, September 28, 2015, 13:16 [IST]

ఛండీగర్: అక్టోబర్ 2 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న సిరిస్ కోసం టీమిండియా మానసికంగా కాకుండా శారీరకంగా కూడా సిద్ధం అవుతుంది. దక్షిణాఫ్రికా జట్టు సుదీర్ఘ పర్యటనను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ టీమిండియా కోసం 'హై ఆల్టిట్యూడ్‌ క్యాంప్‌'ను నిర్వహించారు.

ధర్మశాలలో టీ-20 మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బూట్‌ క్యాంప్‌ (కఠోర శిక్షణ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారంతో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ ముగించుకుని టీమిండియా ధోని సేన సోమవారం ధర్మశాలకు చేరుకోనుంది.

టీమిండియా జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి కోరిక మేరకు ఈ బూట్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సముద్ర మట్టానికి ఏడు వేల అడుగుల ఎత్తులో రెండు రోజులు పాటు నిర్వహించనున్న ఈ బూట్ క్యాంప్‌లో ఆర్మీ తరహాలో ట్రెక్కింగ్‌తోపాటు, దూకడం, పాకడం తదితర వ్యాయామాలను ఆటగాళ్లచే చేయించనున్నారు.

Ahead of South Africa series, Team India to undergo army training

ధోనితో పాటు మొత్తం 31 మంది ఆటగాళ్లు ఈ ఆర్మీ తరహా శిక్షణలో పాల్గొంటారు. ఆటగాళ్లలో సహనం, ఒత్తిడిని జయించే మానసిక ధైర్యాన్ని పెంచేందుకు ఈ కఠోర శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది.

ఈ బూట్ క్యాంప్ కోసం ఈ నెల 30న రావాల్సిన జట్టు 28నే చేరుకుంటుందని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెస్ సెక్రటరీ మోహిత్‌ సూద్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, 5 వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే.

English summary
After fine tuning their cricket skills in Bengaluru, Team India will now undergo a tough 2-day boot camp ahead of the South Africa series, which starts in Dharamsala on October 2.
మీ వ్యాఖ్య రాయండి