Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కూతురు నవ్వులు: ఫోటోలు షేర్‌చేసిన ధోనీ భార్య సాక్షి

Posted by:
Published: Monday, September 28, 2015, 13:39 [IST]

ముంబై: భారత ట్వంటీ 20, వన్డే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి ధోనీ శనివారం నాడు తన ముద్దుల కూతురు జీవా ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం జీవా వయస్సు ఏడు నెలలు. డాటర్స్ డే సందర్భంగా పలు ఫోటోలను సాక్షి ధోనీ శనివారం షేర్ చేసింది.

మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా ఫోటోలను చూసిన వారు భలే క్యూట్‌గా ఉందని అంటున్నారు. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను కట్టిపడేశాయి. డాటర్స్ డే (సెప్టెంబర్ నాలుగో ఆదివారం)ని పురస్కరించుకుని సాక్షి ధోనీ కూతురు జీవా ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది.

ఈ పోస్ట్‌లలో పలు యాంగిల్స్‌లో తీసిన జీవా ఫొటోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. జీవా ఫిబ్రవరి 6వ తేదీన జన్మించింది. ధోనీ ఆ సమయంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చాక.. ఐపీఎల్ మ్యాచుల కోసం ధోనీ కూతురుతో కనిపించాడు.

English summary
Sakshi Dhoni shares adorable pictures of daughter Ziva
మీ వ్యాఖ్య రాయండి