Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

గంగూలీ సైతం: బీసీసీఐ అధ్యక్షుడిగా తెరపైకి కొత్త పేరు

Posted by:
Published: Monday, September 28, 2015, 14:42 [IST]

కోల్‌కత్తా: దాల్మియా మరణంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా బీసీసీఐ అధ్యక్ష పదవికి శశాంక్ మనోహార్ పేరు వినిపిస్తోంది. ఇటీవలే క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సైతం శశాంక్ మనోహార్ పేరునే ప్రతిపాదించాడు.

శశాంక్ మనోహార్‌కు క్యాబ్, ఎన్‌సీసీ, త్రిపుర అండ్ జార్ఖండ్ బోర్డు సభ్యులు తమ మద్దతుని తెలిపేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సైతం బీసీసీఐ అధ్యక్షుడిగా నిజాయితీ పరున్నే ఎంపిక చేస్తామని అన్నారు.

ఈ నేపథ్యంలో బీసీసీఐ బోర్డులో మచ్చలేని వ్యక్తిగా పేరున్న శశాంక్ మనోహార్ అధ్యక్ష పదవిని స్వీకరించడం ఖాయమై పోయిందన్న వార్తలు వస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ బోర్డులో సంస్కరణల కోసం మరింత పారదర్శకత, జవాబుదారీతనం తెచ్చే వ్యక్తి మాత్రమే బీసీసీఐ అధ్యక్షుడు కాగలడన్నారు.

Sourav Ganguly to propose Shashank Manohar's name

శశాంక్ మనోహార్‌ను ఉద్దేశించే అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారని క్రీడా వర్గాలు అంటున్నాయి. మరోవైపు దాల్మియా వారసుడిగా శశాంక్‌ మనోహర్‌ బోర్డు పగ్గాలు చేపట్టేందుకు ఒప్పుకున్నాడని మాజీ కోశాధికారి, మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజయ్‌ షిర్కే తెలిపాడు.

‘మనోహర్‌ అధ్యక్ష బరిలో నిలబడడానికి ఒప్పుకున్నాడు. లేదంటే ఈ విషయాన్ని బయటకు చెప్పేవాన్ని కాదు. దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడుతుంద'ని షిర్కే చెప్పాడు. అంతే కాకుండా శ్రీనివాసన్‌తో పవార్‌ చేతులు కలిపాడని వచ్చిన ఊహా గానాలను షిర్కే కొట్టిపారేశాడు. బోర్డు ప్రయోజనాలకు విరుద్ధంగా పవార్‌ ప్రవర్తించడని విశ్వాసం వ్యక్తం చేశాడు.

'పవార్, మేమంతా మనోహార్‌కు పూర్తి మద్దతుగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డుకు అతడి లాంటి బలమైన వ్యక్తి అధ్యక్షుడిగా అవసరం. గత ఆరు నెలల నుంచి ఠాకూర్ కూడా బోర్డు కార్యదర్శిగా గొప్పగా పనిచేస్తున్నాడు' అని అన్నాడు.

English summary
The die has been cast, and if things go as per script, Sourav Ganguly will not only attend the ensuing Special General Meeting (SGM) of the BCCI as the new president of the Cricket Association of Bengal (CAB) but also propose Shashank Manohar's candidature from East Zone for the cricket Board's top post.
మీ వ్యాఖ్య రాయండి