Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీకెలా సాధ్యమో: ప్రత్యర్థి కెప్టెన్ ప్రశంస, లగేజ్‌రాలేదు

Posted by:
Published: Tuesday, September 29, 2015, 13:46 [IST]

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ మహేంద్ర సింగ్ ధోని నుంచి తాను చాలా నేర్చుకున్నానని దక్షిణాఫ్రికా జట్టు ట్వంటీ 20 కెప్టెన్‌ డుప్లెసిస్‌ సోమవారం అన్నాడు. ఐపీఎల్‌ కూడా తాను క్రికెటర్‌గా ఎదగడానికి చాలా సాయపడిందన్నాడు.

నేను ధోనీని ఎప్పుడూ అడుగుతుంటానని చెప్పాడు. తనంత ప్రశాంతంగా ఎలా ఉంటాడోనని, ధోని నాయకత్వంలో ఆడటం తన అదృష్టమని కితాబిచ్చాడు. అతడిపై తనకు చాలా గౌరవముందని, ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో అతడికి బాగా తెలుసునని ప్రశంసించాడు.

మనం స్వతంత్రంగా ఎలా ఉండాలో ధోనిని చూసి నేర్చుకోవచ్చునని చెప్పాడు. మొత్తంగా ఐపీఎల్‌ వల్ల తన ఆటలో గొప్ప మార్పు వచ్చిందన్నాడు. ఒత్తిడిలో ఎలా బ్యాటింగ్‌ చేయాలో తెలుసుకున్నానని,మంచి కెప్టెన్‌ నాయకత్వంలో ఆడటం వల్ల కెప్టెన్సీని కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరికిందన్నాడు.

 'I am fortunate to have played under calm captain Dhoni'

ఐపీఎల్ వల్ల తాను క్రికెటర్‌గా పరిపూర్ణత చెందానని డుప్లెసి అన్నాడు. మైకేల్‌ హసి లాంటి ఆటగాళ్ల సహచర్యం కూడా ఎంతో మేలు చేసిందన్నాడు.

భారత్‌ పర్యటనలో తొలి మ్యాచ్‌కు ధర్మశాలను వేదికగా ఎంపిక చేయడంపై డుప్లెసిస్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ధర్మశాలలో పేస్‌, బౌన్స్‌ బాగా ఉంటుందని, ఈ మైదానాన్ని తమ తొలి పోరుకు వేదిక అని తెలిసి ఆశ్చర్యపోయానని, పరిస్థితుల్ని మా పేసర్లు సద్వినియోగం చేసుకుంటారన్నాడు.

దక్షిణాఫ్రికా ఆటగాళ్ల లగేజ్ దుబాయ్‌లో..!

రెండున్నర నెలల సుదీర్ఘ తర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టు భారతని వచ్చింది. సఫారీ ఆటగాళ్లు ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అయితే, వారి సామాగ్రి మాత్రం దుబాయ్‌లోనే ఉండిపోయింది.

జొహానెస్‌బర్గ్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సఫారీ జట్టు మధ్యలో దుబాయ్‌లో విమానం మారాలి. భారత్‌కు వెళ్లే విమానాన్ని ఆటగాళ్లు ఎక్కారు. కానీ వారి సామగ్రిని సిబ్బంది ఎక్కించలేదు. సామాగ్రి ఉందని, దానిని త్వరగా తెప్పిస్తామని అధికారులు చెప్పారు.

English summary
Chennai Super Kings' (CSK) future in the Indian Premier League may be uncertain after a two-year suspension but South Africa's Twenty20 captain Faf du Plessis feels five seasons under 'Captain Cool' MS Dhoni in the IPL transformed him as a cricketer.
మీ వ్యాఖ్య రాయండి