Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రాజీవ్ శుక్లా హెచ్చరిక: టోర్నీపై పాకిస్తాన్ యూ టర్న్

Posted by:
Published: Wednesday, September 30, 2015, 12:13 [IST]

కరాచీ: భారత్‌తో క్రికెట్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చీఫ్ యూ టర్న్ తీసుకున్నాడు. తమతో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడకపోతే ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ను బహిష్కరించే అంశాన్ని పరిశీలిస్తామని అని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఈ అంశంపై తానొక్కడినే నిర్ణయం తీసుకోనని పీసీబీ ఛైర్మన్‌ షహర్యార్‌ అన్నాడు. భారత్‌ మాతో సిరీస్‌ ఆడకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని, తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని చెప్పాడు.

భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ విషయంలో నిన్నటి వరకు పిసిబి దూకుడు ప్రదర్శించింది. డిసెంబర్‌లో పాకిస్థాన్‌తో జరుగాల్సిన క్రికెట్ సిరీస్‌లో ఆడకపోతే గనుక ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో భారత్‌ను బహిష్కరిస్తామని పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఇప్పటికే హెచ్చరించాడు.

PCB chief makes U turn on boycotting ties with India

ఈ వ్యాఖ్యల పైన బీసీసీఐ సీనియర్ అధికారి, ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్ శుక్లా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. బహిష్కరిస్తే పాకిస్థాన్‌కు జరిమానా తప్పదని రాజీవ్‌ శుక్లా హెచ్చరించాడు. దీంతో, పీసీబీ చీఫ్ ఇప్పుడు వెనక్కి తగ్గాడు.

అంతర్జాతీయ టోర్నీల్లో భారత్‌ను బహిష్కరించడంపై తామింకా నిర్ణయం తీసుకోలేదన్నాడు. మరోవైపు ఇంతకాలం తాము రాసిన లేఖకు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదన్న పీసీబీ చీఫ్... బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ సమాధానమిచ్చారని పేర్కొన్నారు.

English summary
PCB chief Shaharyar Khan today did a U-turn on his earlier statement on considering the option of boycotting matches with India in ICC and other multi-team events.
మీ వ్యాఖ్య రాయండి