Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వార్మప్ మ్యాచ్: కుర్రాళ్ల చేతిలో సఫారీ చిత్తు

Published: Wednesday, September 30, 2015, 11:52 [IST]

న్యూఢిల్లీ: భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు సిద్ధమవుతున్న దక్షిణాఫ్రికా జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. అంతర్జాతీయస్థాయిలో ఎంతో అనుభవంతోపాటు అత్యంత పటిష్ఠంగా ఉన్న దక్షిణాఫ్రికాపై మణ్‌దీప్ సింగ్ సారథ్యంలోని యువ భారత-ఏ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో మూడు వికెట్లకు 189 పరుగులు సాధించింది. వన్డే జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్ 37, కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ 42 (రిటైర్డ్ హర్ట్), జెపి డుమినీ 68 (నాటౌట్) పరుగులతో రాణించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ' మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ని పూర్తి చేసింది. ఓపెనర్లు మానన్ వోహ్రా, మాయాంక్ అగర్వాల్ అర్ధ శతకాలను నమోదు చేసి, తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు.

South Africa beaten in India tour opener

42 బంతుల్లో 56 పరుగులు చేసిన వోహ్రాను బెహర్డిన్ క్యాచ్ అందుకోగా పార్ట్‌టైమ్ బౌలర్ డుమినీ ఔట్ చేశాడు. మాయాంక్ అగర్వాల్ 49 బంతుల్లో 87 పరుగులు చేసి డి లాంగ్ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు చిక్కాడు.

అతని స్కోరులో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అనంతరం వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (31), కెప్టెన్ మన్దీప్ సింగ్ (12) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.

English summary
South Africa made a poor start to their 10-week tour of India, losing a Twenty20 warm-up match to a second-string side by eight wickets in New Delhi on Tuesday.
మీ వ్యాఖ్య రాయండి