Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఠాకూర్‌పై క్రిమినల్‌ చర్యలకు సుప్రీంలో శ్రీని పిటిషన్‌

Posted by:
Published: Thursday, October 1, 2015, 12:20 [IST]

ముంబై: బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ల మధ్య మరో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. శ్రీనివాసన్‌ను బీసీసీఐ సమావేశాలకు అనుమతించడంపై స్పష్టత కావాలంటూ బీసీసీఐ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

దీనిని వ్యతిరేకిస్తూ శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తనపై ఆ పిటిషన్‌లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఠాకూర్‌పై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తనపై బోర్డు కార్యదర్శిగా ఠాకూర్ సమర్పించిన స్టేట్‌మెంట్లు, తప్పుడు అఫిడవిట్‌లు కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని శ్రీని ఆరోపించాడు.

N Srinivasan moves SC accusing BCCI Secretary Anurag Thakur of perjury

ఆగస్టు 28న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశానికి శ్రీనివాసన్ ఎవరి అనుమతి లేకుండానే లోపలికి వచ్చాడనీ, దీంతో ఆ రోజు భేటీని వాయిదా వేసినట్లు ఆ పిటిషన్‌లో బీసీసీఐ కార్యదర్శి ఠాకూర్ పేర్కొన్నారు. అంతేకాదు ఐపీఎల్‌లో శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వాటాలు బదలాయింపు జరిగిన ట్రస్టులో కూడా శ్రీని సభ్యుడని, ఇది కచ్చితంగా పరస్పర విరుద్ధ లాభం కిందకు వస్తుందని కూడా బోర్డు పేర్కొంది.

దీనిని వ్యతిరేకిస్తూ శ్రీనివాసన్ తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. తప్పుడు ఆరోపణలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు అనురాగ్ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆరోజు సమావేశానికి నేను హాజరవడంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ భేటీకి అధ్యక్షుడు అరగంట ఆలస్యంగా వచ్చాడు.

అతను వచ్చిన తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారని శ్రీనివాసన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీంతో పాటు ఆ రోజు సమావేశానికి సంబంధించి ఎలాంటి మినిట్స్ కూడా రికార్డు చేయలేదు అని పిటిషన్‌లో వివరించారు. అందుకు సాక్ష్యంగా బోర్డు కోశాధికారి అనిరుధ్‌ చౌదరి, ఉపాధ్యక్షుడు టీసీ మాథ్యూస్‌, కేరళ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి జయేష్‌ జార్జ్‌ల అఫిడవిట్‌లను జత చేశాడు.

English summary
N Srinivasan today moved the Supreme Court accusing the BCCI Secretary Anurag Thakur of committing an offence of perjury before the top court for making "plethora" of "misleading" statements against him including that he had "barged" into a meeting of the cricket board's working committee in Kolkata on August 28.
మీ వ్యాఖ్య రాయండి