Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

29న భజ్జీ పెళ్లి: వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదే (ఫోటో)

Posted by:
Published: Friday, October 2, 2015, 10:59 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ వివాహం ఈ నెల 29న జరగనున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న బాలీవుడ్ నటి గీతా బస్రాను భజ్జీ సంప్రదాయబద్ధంగా పెళ్లాడనున్నాడు.

Harbhajan Singh, Geeta Basra's beautiful wedding card!

ఇప్పటికే వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి కోసం అతిథులను ఆహ్వానించేందుకు హార్భజన్ కుటుంబం కలర్‌పుల్ వెడ్డింగ్ ఇన్విటేషన్లను సిద్ధం చేసింది. ఐదు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా భజ్జీ వివాహ వేడుక జరగనుంది. నవంబర్ 1న ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌లో కొత్త జంట గ్రాండ్ రిసెప్షన్‌ను ఇస్తున్నారు.

Harbhajan Singh, Geeta Basra's beautiful wedding card!

ప్రస్తుతం గీత బస్రా లండన్‌లో ఉండగా.. ముంబైలోని డిజైనర్లు ఆమె పెళ్లికి ధరించాల్సిన దుస్తులను డిజైన్‌ చేసి అక్కడికే పంపిస్తున్నట్లు తెలిసింది. ఈరోజు ధర్మశాలలో జరగనున్న ట్వంటీ20 మ్యాచ్‌ జట్టులో హార్భజన్ సింగ్‌కు చోటు దక్కించుకున్నాడు.

Harbhajan Singh, Geeta Basra's beautiful wedding card!

కాగా, హర్భజన్‌కి కూడా అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 5 వరకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోవడంతో ఆ తేదీల్లోనే పెళ్లి పనులు ఖరారు చేసినట్లు సమాచారం. భజ్జీ వివాహ వేడుకకు టీమిండియా ఆటగాళ్లతోపాటు క్రీడా, రాజకీయ ప్రముఖులు, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు.

English summary
Veteran Indian spinner Harbhajan Singh and Bollywood actress Geeta Basra are all set to tie the nuptial knot after being in a relationship for quite some time now.
మీ వ్యాఖ్య రాయండి