Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవ ఎన్నిక

Posted by:
Updated: Sunday, October 4, 2015, 14:58 [IST]

ముంబై: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా శశాంక్‌ మనోహర్‌ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో బోర్డు అధ్యక్షుడిగా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం ఆఖరి రోజు కావడంతో ఆయనొక్కరే రేసులో మిగిలారు.

దీంతో ఈరోజు జరిగిన బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అంతక ముందు అధ్యక్ష పదవిలో ఉన్న జగ్‌మోహన్ దాల్మియా ఈస్ట్ జోన్‌కు చెందినవారు.

Just in: Shashank Manohar appointed new BCCI president

బీసీసీఐ బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధి లేదా ఆ సంఘాలు బలపరిచిన వ్యక్తికి బోర్డు పగ్గాలు చేపట్టాలి. కానీ ఈస్ట్ జోన్‌లోని ఆరు క్రికెట్ సంఘాలూ మనోహర్‌కు మద్దతు తెలపడంతో బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్‌ను ఎన్నికయ్యారు.

కాగా, వృత్తిరీత్యా న్యాయవాది ఆయిన శశాంక్ మనోహర్ అంతక ముందు 2008 నుంచి 2011 వరకు బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఆయనకు బీసీసీఐ, ఐసీసీ మాజీ అధ్యక్షుడిగా పని చేసిన శరద్ పవార్‌కు సన్నిహితుడిగా ఉన్నారు.

Story first published:  Sunday, October 4, 2015, 14:53 [IST]
English summary
Shashank Manohar appointed new BCCI president.
మీ వ్యాఖ్య రాయండి