Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఎట్టకేలకు: మహిళా క్రికెటర్లకూ బిసిసిఐ కాంట్రాక్టులు

Published: Monday, October 5, 2015, 12:39 [IST]

న్యూఢిల్లీ: ఇకపై భారత మహిళా క్రికెటర్లకు కూడా సెంట్రల్‌ కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నూతన అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ప్రకటించాడు. దేశంలో మరింత మంది క్రీడాకారిణులు క్రికెట్‌ వైపు మళ్లేలా పరిస్థితులు మెరుగు పరుస్తామని పేర్కొన్నాడు.

కాగా, పురుషుల జట్టుకు 11ఏళ్ల నుంచి సెంట్రల్‌ కాంట్రాక్టు విధానం అమలులో ఉంది. క్రికెటర్లను వివిధ గ్రేడులుగా విభజించి.. అందుకు తగ్గట్టుగా వార్షిక వేతనాలు చెల్లిస్తున్నారు. తమకూ ఈ పద్ధతి వర్తింపజేయడంపై దీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న మహిళా క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యమైనప్పటికీ మహిళా క్రికెటర్లకు కాంట్రాక్టు విధానం అమలు చేయడం శుభ సూచకమని భారత జట్టు మాజీ కెప్టెన్ డియానా ఎడుల్జీ తెలిపారు. నూతన అధ్యక్షుడు మనోహర్ మహిళా క్రికెటర్లకు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 Women cricketers to finally get BCCI central contracts

'ఠాకూర్‌పై కేసు వెనక్కి తీసుకోండి'

బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌పై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అసత్య ప్రమాణ కేసును ఉపసంహరించుకోవాలని శ్రీనివాసన్‌ను మనోహర్‌ కోరాడు.

‘ఠాకూర్‌పై కేసును ఉససంహరించుకోవాలని తాను విజ్ఞప్తి చేసినట్లుగా శ్రీనివాసన్‌కు చెప్పాలని టిఎన్‌సీఏ ప్రతినిధి రామన్‌కు మనోహర్‌ చెప్పాడు. చర్చల ద్వారా పరిష్కారమయ్యే విషయాల్లో కోర్టులదాకా వెళ్లరాదని అన్నాడు' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

శ్రీనివాసన్‌కు మద్దతుగా దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఉపసంహరించుకోవాల్సిందిగా మాథ్యూస్‌ (కేరళ సంఘం), బోర్డు కోశాధికారి అనిరుధ్‌ చౌదరిలకు మనోహర్‌ సూచించినట్లు తెలిసింది.

English summary
The long wait for India women's cricketers ended today when newly-elected BCCI President Shashank Manohar announced central contracts for them, 11 years after the system was introduced for their male counterparts.
మీ వ్యాఖ్య రాయండి