Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఏడ్చాడు: 1996, 2015కు తేడా కాంబ్లీ లేకపోవడమే!

Posted by:
Published: Tuesday, October 6, 2015, 13:38 [IST]

ముంబై: సోమవారం నాడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ట్వంటీ 20 సందర్భంగా అభిమానులు మైదానంలోకి నీళ్ల బాటిల్స్ వేశారు. ఇది దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1996లో ఇలాగే అభిమానులు బాటిల్స్ వేసిన సంఘటనను సామాజిక వేదికల్లో పలువురు గుర్తు చేస్తున్నారు.

1996లో ప్రపంచ కప్ సమయంలో అభిమానులు ఇలాగే నీళ్ల సీసాలు వేశారు. ఆ సమయంలో వినోద్ కాంబ్లీ కంటతడి పెట్టాడు. ఈ సంఘటన కోల్‌కతాలో జరిగింది.

శ్రీలంక - భారత్ మధ్యన సెమీ ఫైనల్ సమయంలో అభిమానులు మైదానంలోకి సీసాలు, రాళ్లు విసిరేశారు. మళ్లీ 19 ఏళ్ల తర్వాత మరోసారి అభిమానులు ఇలాగే ప్రవర్తించారు. ట్వంటీ 20లో వరుసగా రెండో ఓటమిని జీర్ణించుకోలేని అభిమానులు నీళ్ల సీసాలు విసిరేశారు.

Fans recall Vinod Kambli's 1996 antics as crowd trouble hits Cuttack!

తాజా సంఘటన నేపథ్యంలో... సామాజిక అనుసంధాన వేదికల్లో అభిమానులు 1996 నాటి సంఘటనను ఓసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

1996, 2015 ఘటనలలో తేడా ఏమిటంటే... ఇప్పుడు ఏడ్చేందుకు జట్టులో వినోద్ కాంబ్లీ లేడు అని ఒకరు ట్వీట్ చేశారు. కటక్‌లో వినోద్ కాంబ్లీ లేడని మరొకరు ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ అనంతరం కాంబ్లీకి నాటి సంఘటనలు గుర్తుకు వస్తాయని మరొకరు ట్వీట్ చేశారు. చాలామంది కాంబ్లీని గుర్తుకు తెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.

1996 నాటి ప్రపంచ కప్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత ఓటమిని ఊహించని అభిమానులు ఆనాడు స్టేడియంలో రణరంగం సృష్టించారు. అందుబాటులో ఉన్న వస్తువులన్నీ స్టేడియంలో విసిరారు. మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోవడంతో... క్రీజులో ఉన్న వినోద్ కాంబ్లీ కన్నీటితో మైదానాన్ని వీడాడు.

English summary
A teary eyed Vinod Kambli being escorted off the Eden Garden's field in 1996 World Cup remains one of the lasting images from another decade in Indian cricket.
మీ వ్యాఖ్య రాయండి