Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

గ్రౌండ్‌లోకి బాటిళ్లు: రియాక్షనే.. ఫ్యాన్స్‌కి ధోనీ అండ (పిక్చర్స్)

Posted by:
Published: Tuesday, October 6, 2015, 10:18 [IST]

కటక్: ట్వంటీ 20 రెండో మ్యాచ్‌లోను భారత్ ఘోర వైఫల్యం చెంది, ఓడిపోవడంతో కటక్ అభిమానులు బారాబాతి మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరేశారు. దీనిపై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఇది ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందని తాను భావించడం లేదని చెప్పాడు.

ఆట మధ్యలో ఓ స్టాండులోని అభిమానులు మైదానంలోకి బాటిళ్లను విసిరారని చెప్పాడు. దీంతో, అంపైర్ ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాడని చెప్పాడు. మేం బాగా ఆడలేదని, అలాంటప్పుడు ఇలాంటి ప్రతి చర్య సహజమేనని చెప్పాడు.

తొలుత కొన్ని బాటిళ్లు అసంతృప్తితో వేశారని, కానీ ఆ తర్వాత ఎక్కువ బాటిళ్లు ఏదో చెడు చేయాలనే ఉద్దేశ్యంతో వేయలేదని అభిప్రాయపడ్డాడు. గతంలో జరిగిన అంశాలను మీరు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఓసారి మేం విశాఖలో ఆడినప్పుడు గెలిచామని, అప్పుడు కూడా ఇలాగే బాటిల్స్ పడ్డాయని గుర్తు చేశాడు.

ఈ మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకే చేతులెత్తేయగా, దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ 17.2 ఓవర్లలో ఆలౌట్ అయి 92 పరుగులు చేసింది.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

కటక్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఫ్రీడమ్ సిరీస్ (టీ20) టైటిల్ మాత్రమే చేజారలేదు. జెంటిల్మన్ క్రికెట్ పరువు ప్రతిష్ఠలు తీశారని విమర్శలు చేస్తున్నారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

పేలవ ప్రదర్శనలో టీమిండియా టైటిల్‌ను చేజార్చుకుంటే, దానిని జీర్ణించుకోలేకపోయిన భారత క్రికెట్ అభిమానులు మైదానంలోకి బాటిళ్లు విసిరేశారు. తమ జట్టు పేలవ ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియం స్టాండ్స్ నుంచి వాటర్ బాటిళ్లను పిచ్ పైకి విసిరేశారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

పిచ్ నలుదిశల నుంచి వాటర్ బాటిళ్లు వచ్చిపడుతున్న నేపథ్యంలో మ్యాచ్ దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయింది.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

గతంలో 1996 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నమోదైన చేదు జ్ఞాపకాలను ఫ్యాన్స్ మరోసారి గుర్తు చేశారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వాటర్ బాటిళ్లను పిచ్ పైకి విసిరేసి క్రికెటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి 40 నిమిషాల తర్వాత మ్యాచ్‌ను కొనసాగించేలా చేశారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

92 పరుగులకే చేతులెత్తేసరికి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో భారత ఇన్నింగ్స్ ముగియగానే ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరారు. చేతిలో ఉన్న పేపర్లని ఫ్లెట్లుగా చేసి మైదానంలోకి విసిరారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

నిర్వాహకులు ఇవన్నీ తొలగించారు. తర్వాత సౌతాఫ్రికా లక్ష్యఛేదన దిశగా సాగుతుండడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు మరోసారి బాటిళ్లు, పేపర్లు విసురుతూపోయారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

ఇది శ్రుతిమించడంతో 11వ ఓవర్ తర్వాత ఆటని నిలిపివేశారు. తర్వాత మళ్లీ మొదలైనా అభిమానుల తీరు మారకపోవడంతో 13వ ఓవర్ తర్వాత మరోసారి ఆట నిలిచిపోయింది.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

అప్పటికి సౌతాఫ్రికా విజయానికి 42 బంతుల్లో 24 పరుగులు చేయాలి. ఈ దశలో ఓ అరగంట పాటు మ్యాచ్ ఆగిపోయింది. సహజంగా భారత స్టేడియాల్లో బాటిళ్లను అనుమతించరు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

అయితే ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) మాత్రం... మేం ఇక్కడ చిన్న బాటిళ్లను, వాటర్ పౌచ్‌లను నిషేధించాం. పెద్ద బాటిళ్లను అనుమతించాం. ఎందుకంటే అవి విసిరినా ఎక్కువ దూరం వెళ్లవు అని సమర్థించుకున్నారు.

భారత్ - దక్షిణాఫ్రికా మ్యాచ్

1996 వరల్డ్‌కప్ ఈడెన్‌గార్డెన్స్ ఉదంతాన్ని గుర్తుచేసిన బాటిళ్ల విసిరివేత ఘటన కారణంగా ఈ మ్యాచ్‌కు 51 నిమిషాలపాటు అంతరాయం కలిగింది.

 

English summary
MS Dhoni was forthright with his opinions following India's abject surrender in the second T20I in Cuttack. The Indian captain spoke about the bottle-throwing incident at the Barabati stadium.
మీ వ్యాఖ్య రాయండి