Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీటీఎల్: రవిశాస్త్రి-కోహ్లీలకు పరస్పర ప్రయోజనాల్లేవ్

Posted by:
Published: Tuesday, October 6, 2015, 9:12 [IST]

జలంధర్/ముంబై: అంతర్జాతీయ ప్రిమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లో భాగస్వాములు అయినంత మాత్రాన విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రిలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండవని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పాడు. ఐటీపీఎల్‌లో కోహ్లి సహ యజమానిగా ఉన్న జట్టుకు రవిశాస్త్రి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.

ఇది వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఠాకూర్‌ స్పందించాడు. ఐపీటీఎల్‌లో కోహ్లి, రవిశాస్త్రి భాగస్వాములని, అంతమాత్రాన వాళ్లిద్దరికి మధ్య పరస్పర ప్రయోజనాలు ఉండవని, క్రికెట్‌ వేరు టెన్నిస్‌ వేరని చెప్పాడు. పరస్పన విరుద్ధ ప్రయోజనాల కేసులను పరిష్కరించడానికి బోర్డు ఒక నెల వ్యవధిలో అంబుడ్స్‌మన్‌ను నియమిస్తుందన్నాడు.

No Conflict of Interest in Shastri-Kohli IPTL Partnership: Anurag Thakur

భజ్జీ - గీతా పెళ్లికి భారత్ - సౌతాఫ్రికా జట్లు!

భారత్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌, ప్రముఖ మోడల్‌ గీతా బస్రాల పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 29న జరిగే ఈ వివాహ వేడుకకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. పంజాబ్‌ సంప్రదాయంలో ఈ పెళ్లి తంతు జరగనుంది.

పెళ్లి శుభలేఖను డిజైనర్‌ ఏడీ సింగ్‌ తయారు చేసి ట్విట్టర్‌లో పెట్టాడు. ఈ శుభలేఖ లోపల బంగారు పూత పూసిన ఫలకం మీద హెచ్‌ (హర్భజన్‌), జి (గీత) అక్షరాలు పొందుపరిచారు. ఈ వివాహ వేడుకకు భారత క్రికెటర్లతో పాటు ప్రస్తుతం సిరీస్‌ ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా హాజరయ్యే అవకాశముందివివాహ వేడుకకు భజ్జీ సొంత పట్టణం జలంధర్‌లోని హోటల్‌ క్లబ్‌ కబనా ఆతిథ్యమివ్వనుంది.

English summary
No Conflict of Interest in Shastri-Kohli IPTL Partnership: Anurag Thakur
మీ వ్యాఖ్య రాయండి