Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అమెరికన్లు క్రికెట్ బ్యాట్లు పట్టాలి: సచిన్ ఆకాంక్ష

Published: Wednesday, October 7, 2015, 12:56 [IST]

వాషింగ్టన్: అమెరికన్లు చాలా ఇష్టపడే బేస్ బాల్ బ్యాట్లతో పాటు క్రికెట్ బ్యాట్లు పడితే చూడాలని ఉందని భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. తన టోర్నీ ద్వారా అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడం కోసం సచిన్ తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే.

'అమెరికన్లు బేస్ బాల్ చూడటాన్ని ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. అమెరికన్లు కనుక క్రికెట్ చూసేందుకు స్టేడియానికి వస్తే.. ఆటను ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్'లను ఫాలో అవుతారు' అని సచిన్ పేర్కొన్నాడు.

Sachin Tendulkar wants Americans to pick up cricket bats

అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు గాను 'షేన్‌వార్న్- సచిన్ టెండూల్కర్ టీ20 లీగ్' పేరిట నిర్వహించనున్న సిరిస్ నవంబర్‌లో ఆరంభం కానుంది. మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ అక్టోబర్ చివరకు ముగియనుండటంతో ఆయా స్టేడియాల్లో ఈ టోర్నమెంట్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్, వసీం అక్రమ్, లారా, కలిస్, మహేల తదితర దిగ్గజాలతో కలిసి సచిన్ అమెరికాలో టి-20 మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ క్రమంలోనే అమెరికా వెళ్లిన సచిన్ అక్కడ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అమెరికాలో మాజీ క్రికెటర్లు మూడు టి-20 మ్యాచ్ లు ఆడనున్నారు.

టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ల్లో ఆడనున్న 28మంది మాజీ ఆటగాళ్లతో టోర్నీ నిర్వహకులైన సచిన్ టెండూల్కర్‌, షేన్ వార్న్‌లు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. నవంబర్ 7న న్యూయార్క్‌లో, 11న హోస్టన్‌లో, 14న లాస్ ఏంజెలిస్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

English summary
India's master blaster Sachin Tendulkar who is eyeing America as the next target in his mission to spread cricket, said he would like to see more Americans picking up cricket bats along with baseball bats.
మీ వ్యాఖ్య రాయండి