Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఈడెన్‌లో రిటైరవుతా, మేం ఒక్కసారి గెలిస్తే అంతే: భజ్జీ

Posted by:
Published: Thursday, October 8, 2015, 11:19 [IST]

కోల్‌కతా: తనకు ఈడెన్ గార్డెన్స్ అంటే ఎంతో ఇష్టమని, తనకు ఇది ప్రత్యేకమైన మైదానమని, తన కెరీర్‌కు ఇక్కడే ముగింపు పలకాలన్నది తన కోరిక అని భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బుధవారం నాడు చెప్పాడు.

తన రిటైర్మెంట్ విషయంలో ఎలాంటి ప్రణాళిక ఇప్పటి వరకు అనుకోలేదని చెప్పాడు. అయితే, రిటైర్మెంట్ మాత్రం ఈడెన్ గార్డెన్‌లోనే కావాలనుకుంటున్నానని చెప్పాడు. అది టెస్ట్ మ్యాచ్ అయి ఉండాలని ఆకాంక్షించాడు. 2001లో ఆస్ట్రేలియా పైన భారత్ చారిత్రక విజయం సాధించింది. అప్పుడు భజ్జీ హ్యాట్రిక్ తీశాడు.

I want to retire at Eden Gardens, says Harbhajan Singh

తాము ట్వంటీ 20 సిరీస్ ఓడిపోయినప్పటికీ చివరి ఆటలో చేయడానికి చాలా ఉందని భజ్జీ అన్నాడు. మేం గురువారం నాడు గెలిస్తే ఆ తర్వాత కథ వేరుగా ఉంటుందన్నాడు. వన్డేలు, టెస్టులు వస్తున్నాయని, ఈడెన్ గార్డెన్లో అత్యుత్త ప్రదర్శన చేస్తామన్నాడు.

మేం ఒక్కసారి గెలిస్తే ఆ తర్వాత మమ్మల్ని ఓడించడం చాలా కష్టమని చెప్పాడు. ఈడెన్ మాకందరికీ చాలా ప్రత్యేకమైన మైదానం అని చెప్పాడు. ఇక్కడ గెలవడం ప్రతిష్టాత్మకం అన్నాడు. చివరి ట్వంటీ 20లో గెలిచి వన్డే సిరీస్‌కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటామన్నాడు.

English summary
As much as Eden Gardens belongs to VVS Laxman for his epic 281 against Australia in that historic Test, it is also Harbhajan Singh's spiritual home for the 13 wickets that he took in that particular match.
మీ వ్యాఖ్య రాయండి