Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్రికెట్‌పై హార్దిక్ పటేల్ కన్ను: ప్లీజ్... సౌరాష్ట్ర వేడుకోలు

Posted by:
Published: Friday, October 9, 2015, 14:22 [IST]

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గురువారం నాడు వన్డే క్రికెట్ మ్యాచ్‌కు ఎలాంటి సెగ తగలకుండా... కోటా ఆందోళనకారుడు హార్దిక్ పటేల్‌కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల హార్దిక్ పటేల్ పటేల్‌లకు రిజర్వేషన్‌ల పైన ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

గుజరాత్ పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ నిరసనకు అవకాశమున్న ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడం లేదు. ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా ఈ నెల 18న రాజ్‌కోట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది.

India vs South Africa: SCA appeals to Hardik Patel to refrain from agitation during ODI

ఈ మ్యాచ్ టికెట్లను వీలయినన్ని కొనుగోలు చేసి స్టేడియంలోకి వెళ్లి ఆందోళనకు దిగాలని తన అనుయాయులకు హార్దిక్ పిలుపునిచ్చారు. ఇది తెలుసుకున్న సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ఆందోళనను నివారించేందుకు రంగంలోకి దిగింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానున్న ఈ మ్యాచ్ ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటున్నట్లు సంఘం గౌరవ కార్యదర్శి నిరంజన్ షా గురువారం నాటి మీడియా సమావేశంలో చెప్పారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి ఆందోళనకు దిగొద్దని హార్దిక్ పటేల్, ఆయన అనుచరులకు షా విజ్ఞప్తి చేశారు.

English summary
Saurashtra Cricket Association (SCA) On Thursday appealed to Patel quota agitation leader Hardik Patel and his supporters to not agitate during the one-day international (ODI) match to be played between India and South Africa on October 18 at a stadium on the city outskirts.
మీ వ్యాఖ్య రాయండి