Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సచిన్-వార్న్ సిరీస్‌లో 13వ ఆటగాడిగా ఒబామా?

Published: Friday, October 9, 2015, 12:51 [IST]

న్యూయార్క్: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు సంయుక్తంగా అమెరికాలో నిర్వహిస్తున్న ఆల్ స్టార్స్ సిరీస్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెలలో జరుగనున్న ఎగ్జిబిషన్ ట్వంటీ20 మ్యాచుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 13వ ఆటగాడిగా ఆడనున్నట్లు తెలిసింది. ఒబామానే ఆటను ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఈ సిరీస్‌లో సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్ల మధ్య న్యూయార్క్, హూస్టన్, లాస్ఏంజెల్స్ వేదికలపై మ్యాచులు జరగనున్నాయి. నవంబర్ 7న తొలి మ్యాచ్ జరుగుతుంది.

 US President Barack Obama to be '13th Man' in Sachin-Warne series?

కాగా, గురువారంనాడు ఆల్ స్టార్స్ సిరీస్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా బరాక్ ఒబామాను ఆహ్వానించింది. బ్రియాన్ లారా లాంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు ఓ ప్రముఖ వ్యక్తి 13వ ఆటగాడిగా సచిన్-వార్న్ సిరీస్‌లో పాల్గొంటున్నారని తెలిపింది.

ఒబామా, బ్రియాన్ లారాల ఫొటోతో ఆ ట్వీట్ చేసింది. దీనికి 2.36మిలియన్ ఫాలోవర్లకు కలిగిన లారా కూడా రీట్వీట్ చేశాడు.

 US President Barack Obama to be '13th Man' in Sachin-Warne series?

2009లో లారా దగ్గర ఒబామా బ్యాట్ పట్టుకుని సరదాగా ఆటను నేర్చుకున్నాడు. లారా సంతకం చేసిన బ్యాట్ ఇవ్వడంతో దాంతోనే ఒబామా కాసేపు కసరత్తు చేశారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో టోర్నమెంటుకు వచ్చి ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు లారా. తాను ఎప్పుడూ క్రికెట్ మైకేల్ జోర్డాన్‌ను కలిసేందుకు ఇష్టపడతానని ఒబామా తెలిపారు.

కాగా, ఇటీవల సచిన్ టెండూల్కర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అమెరికన్లు బేస్ బాల్ చూడటాన్ని ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్ కూడా అలాగే ఉంటుంది. అమెరికన్లు కనుక క్రికెట్ చూసేందుకు స్టేడియానికి వస్తే.. ఆటను ఇష్టపడతారు. క్రికెట్ మ్యాచ్'లను ఫాలో అవుతారు' అని సచిన్ పేర్కొన్నాడు.

English summary
Cricket legends Sachin Tendulkar and Shane Warne have unveiled their All Stars Series to be played in the United States of America. With 3 exhibition Twenty20 matches next month with the greats of the game, there is a possibility of American President Barack Obama being the "13th Man".
మీ వ్యాఖ్య రాయండి