Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీంలో ధోనీ ఇంకా అవసరమా, తేల్చండి: అజిత్ బాంబు

Posted by:
Published: Saturday, October 10, 2015, 10:57 [IST]

న్యూఢిల్లీ: మాజీ పేసర్ అజిత్ అగార్కర్ భారత వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన బాంబు పేల్చాడు. ధోనీకి జట్టులో చోటు అవసరమా? అంటూ ప్రశ్నించాడు. ఈ విషయంలో సెలెక్టర్లు ఆలోంచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నాడు.

టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ సత్తాను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ధోనీ భవిష్యత్ పైన దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత సెలెక్టర్లు ఓ నిర్ణయానికి వస్తారని తాను భావిస్తున్నానన్నాడు. ఇక నుంచి ధోనీ ప్రదర్శనను సెలెక్టర్లు నిశిత దృష్టితో చూడాల్సి ఉందన్నాడు.

ధోనీ గొప్ప ఆటగాడు కావొచ్చునని కానీ, అతని బాధ్యతను జట్టే తీసుకునే పరిస్థితి రావొద్దన్నాడు. పూర్వస్థాయిని గుర్తు చేస్తున్నట్టుగా ఆడాలి తప్ప విఫలమవుతున్నా ఫర్వాలేదు అనిపించకూడదన్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగోస్థానంలోకి ప్రమోట్ చేసుకుంటానన్న ధోనీ మాట తనకు రుచించడం లేదన్నాడు.

Ajit Agarkar questions MS Dhoni's place in Indian team

ప్రపంచ కప్ ముగిసిందే మొన్న అని, వచ్చే ప్రపంచ కప్ కోసం ఈ నాలుగేళ్లలో పటిష్ఠ జట్టును తయారుచేసుకోవాలన్నాడు. అలాంటిది కెరీర్ చివరి దశలో ఉన్న ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందువరుసలో రావాలనుకోవడం సరికాదన్నాడు.

ధోని భారత గొప్ప ఆటగాడనడంలో సందేహం లేదని, అయితే అతడు జట్టుకు భారంగా మారకూడదన్నాడు. చాలా ఏళ్లు గొప్పగా ఆడాడని ప్రస్తుతం విఫలమైతే ఫర్వాలేదనుకోకూడదన్నాడు.

కేవలం కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగా జట్టులో అతడి స్థానాన్ని సెలెక్టర్లు సమీక్షించాల్సిన అవసరముందన్నాడు.
బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ధోని టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేసినా మన జట్టు ఓడిపోయిందని, కెప్టెన్‌గా వరుసగా విఫలమవుతున్న ధోనికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ కీలకమన్నాడు.

English summary
Former India fast bowler Ajit Agarkar has questioned Mahendra Singh Dhoni's place in the Indian team and urged the selectors to scrutinise his performance as a player as well as captain in the limited overs format.
మీ వ్యాఖ్య రాయండి