Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇప్పటికీ ధోనీయే నెం.1.. డౌట్ లేదు, ప్లీజ్: గవాస్కర్

Posted by:
Published: Monday, October 12, 2015, 16:17 [IST]

కాన్పూర్: భారత జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ మంచి ఫినిషర్ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో ట్వంటీ 20 సిరీస్ కోల్పోవడం, తొలి వన్డే ఓడిపోవడంపై ధోనీ పైన విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ధోనీ మంచి మ్యాచ్ ఫినిషర్ అనే విషయం పైన ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నాడు. ఏదో ఒక ఆటలో విఫలమైనంత మాత్రాన ధోనీని విమర్శించాల్సిన అవసరం లేదని చెప్పాడు. భారత్ నెంబర్ వన్ మ్యాచ్ ఫినిషర్ ధోనీయే అన్నాడు.

Mahendra Singh Dhoni is 'Still India's No. 1 Finisher', Says Sunil Gavaskar

కొన్ని సందర్భాలలో మనం సరిగ్గా చేస్తామనుకున్నది చేయడంలో విఫలమవుతుంటామని, అది కేవలం క్రీడలకే పరిమితం కాదన్నాడు. ప్రతి రంగంలోనూ మనం అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చునని చెప్పాడు. ఓటమికి కేవలం ధోనీనే బలిపశువును చేయవద్దని హితవు పలికాడు.

జట్టులో సమష్టితత్వం లోపించినప్పుడు ఓటమి సహజంగానే ఉంటుందన్నారు. మన జట్టులో ఏదైనా మెరుగుపడవలసి ఉందనుకుంటే అది ఇంకా బౌలింగ్ అన్నాడు. భారత క్రికెట్ జట్టుకు ఎవరైతే వన్నె తెచ్చారో వారివైపు దయచేసి వేలు చూపించవద్దన్నాడు.

English summary
Mahendra Singh Dhoni is 'Still India's No. 1 Finisher', Says Sunil Gavaskar
మీ వ్యాఖ్య రాయండి