Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తిప్పేసిన తాహిర్, రబడ ఎదుట చేతులెత్తేసిన ధోనీ

Posted by:
Published: Monday, October 12, 2015, 12:12 [IST]

కాన్పూర్: ఇరవై ఏళ్ల బౌలర్ కాగిసో రబడ... అనుభవజ్ఞుడైన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని చివరి ఓవర్లలో బోల్తా కొట్టించాడు. ఆదివారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 5 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది.

బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో భారత్‌ కొంపముంచింది చివరి ఓవర్లే. 46 ఓవర్లకు 269/3తో భారత్ పటిష్ట స్థితిలో ఉంది. 4 ఓవర్లలో 35 పరుగులు చేయాలి. రోహిత్‌ శర్మ అప్పుడే 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు కెప్టెన్ ధోని ఉన్నాడు.

సునాయాసంగా మ్యాచ్‌ గెలిచే అవకాశముంది. ఈ స్థితిలో డివిలియర్స్‌ ఓ అనూహ్యమైన ఎత్తుగడతో భారత్‌ను గట్టి దెబ్బ తీశాడు. 9 ఓవర్లలో వికెట్‌ తీయకుండా 53 పరుగులు చేసిన తాహిర్‌ను నమ్మి అతడికి బంతి ఇచ్చాడు. ఆ ఓవరే మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

 Never felt so much pressure before - Rabada

మలుపు తిప్పిన తాహిర్

తాహిర్ వేసిన తొలి బంతికే రోహిత్‌ ముందుకొచ్చి షాట్‌ ఆడబోయాడు. కానీ బంతి ఎక్కడో స్టాండ్స్‌లో తేలలేదు. తాహిర్‌ చేతుల్లో చిక్కింది. ఓ అద్భుత ఇన్నింగ్స్‌కు ఓ పేలవమైన షాట్‌తో తెరపడింది. రైనా కూడా తాహిర్‌కే వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో భారత్‌ ఒత్తిడిలో పడిపోయింది.

రబడ ముందు ధోనీ చేతులెత్తేశాడు!

ఇరవై ఏళ్ల వయస్సు ఉన్న సౌతాఫ్రికా బౌలర్ రబడ ముందు బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీ చేతులెత్తేశాడు. రబడకు ఇది ఆరో వన్డేనే. ఈ వన్డేలో తొలి 9 ఓవర్లలో వికెట్‌ తీయకుండా 53 పరుగులిచ్చాడు. ఇలాంటి బౌలర్‌కు చివరి ఓవర్లో 11 పరుగుల్ని కాపాడే బాధ్యత అప్పగించాడు కెప్టెన్ ఏబీ డివిల్లీయర్స్.

మరోవైపు, బెస్ట్ ఫినిషర్ అయిన ధోనీ క్రీజులో ఉన్నాడు. కానీ యువ బౌలర్‌ రబడ తన అద్భుతం చేశాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో అగ్రశ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించి భారత్‌కు విజయాలందించిన ధోని.. రబడ ముందు మాత్రం ఏం చేయలేకపోయాడు.

తొలి బంతికి కష్టం మీద రెండు పరుగులు రాబట్టిన ధోని, రెండో బంతికి సింగిలే తీశాడు. మూడో బంతికి బిన్నీ ఒక పరుగు చేయడంతో మళ్లీ ధోని స్త్ట్రెకింగ్‌కు వచ్చాడు. ధోని భారీ షాట్‌కు ప్రయత్నిస్తే బంతి బ్యాట్‌ అంచుకు తాకి అక్కడే గాల్లోకి లేచి రబడ చేతుల్లో పడింది.

ఆ తర్వాత బిన్నీ వెంటనే అవుటయ్యాడుయ. మొత్తానికి రబడ... చివరి ఓవర్లో ఐదే పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా సౌతాఫ్రికాకు అద్భుత విజయం అందించాడు.

పాఠశాలలో ఉండగా ధోని చివరి ఓవర్లలో మ్యాచ్‌లు ముగించడం చాలాసార్లు చూశానని, అలాంటి ఆటగాడికి బౌలింగ్‌ చేయడం మాటలు కాదని, తక్కువ లెంగ్త్‌లో బంతులేద్దామా అని డివిలియర్స్‌ను అడిగానని, ధోని పుల్‌ షాట్లు బాగా ఆడతాడని కాబట్టి వద్దన్నాడని, అందుకే గుడ్‌ లెంగ్త్‌లో బంతులేశానని, అది బాగా పని చేసిందని రబడ చెప్పాడు.

English summary
Kagiso Rabada has had to defend at the death before, with mixed results.
మీ వ్యాఖ్య రాయండి