Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

2వ వన్డే: ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో టీమిండియా

Posted by:
Published: Tuesday, October 13, 2015, 16:04 [IST]

ఇండోర్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 14)న టీమిండియా, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్న హోల్కర్ స్డేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఉపయోగించనున్న డ్రస్సింగ్ రూమ్ పేరు వింటే ఆశ్చర్యం కలగకమానదు.

ఎందుకంటే హోల్కర్ స్డేడియంలో టీమిండియాకు కేటాయించిన డ్రెస్సింగ్ రూమ్ పేరు 'రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్'. వరుస పరాజయాలతో ఢీలా పడిన టీమిండియాకు రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్‌ రూమ్ ద్వారా ప్రేరణ పొందనున్నారు.

బుధవారం జరగనున్న డే నైట్ మ్యాచ్ కోసం ఇండోర్ చేరుకున్న టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ పైభాగాన ఉన్న బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ పేరుని చూసి, కొత్త ఉత్సాహంతో ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.

1996లో క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రాహుల్ ద్రవిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగులు సాధించారు. ఇందులో 48 సెంచరీలు(36 టెస్టులు, 12 వన్డేలు) ఉన్నాయి.

భారత్ తరుపున 164 టెస్టు మ్యాచ్‌లు, 344 వన్డే మ్యా‌చ్‌లు, 1 ట్వంటీ మ్యాచ్ ఆడారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. 42ఏళ్ల రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం ఇండియా ఏ జట్టు కోచ్‌గా ఉన్నారు.

nd ODI in Indore: Team India will be in 'Rahul Dravid Dressing Room'

ఐదు వన్డేల సిరిస్‌లో 0-1 లీడ్‌తో దక్షిణాఫ్రికా ముందంజలో ఉంది. అయితే హోల్కర్ స్టేడియంలో జరిగిన గత మూడు వన్డే మ్యాచ్‌ల్లో విజయం సాధించిన రికార్డు టీమిండియాకు ఉంది. 2011లో టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండిస్ జట్టుపై డబుల్ సెంచరీ ఇక్కడే సాధించాడు.

English summary
MS Dhoni and his men will be inspired by former India captain Rahul Dravid when they face South Africa in the 2nd ODI at the Holkar Stadium here tomorrow (October 14).
మీ వ్యాఖ్య రాయండి