Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మోంగియా ఫిక్సరే: విచారణలో కివీస్ ప్లేయర్ విన్సెంట్

Posted by:
Published: Tuesday, October 13, 2015, 10:51 [IST]

లండన్: టీమిండియా మాజీ ఆటగాడు దినేశ్ మోంగియా ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ లూ విన్సెంట్ లండన్ కోర్టులో జరిగిన ఓ విచారణలో వెల్లడించాడు. తమ జట్టు మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ కోసం తనతో పాటు మోంగియా తదితరులు ఫిక్సింగ్ చేశామని విన్సెంట్ వెల్లడించాడు.

తనను కెయిన్స్ ఈ ముగ్గులోకి దించాడని ఆరోపించిన విన్సెంట్, పోటీలు జరుగుతున్న సమయంలో ఓ ఇండియన్ తన వద్దకు వచ్చి ఫిక్సింగ్ ప్రతిపాదనతో వచ్చాడని తెలిపారు. డబ్బులతో పాటు అందమైన యువతులను పంపుతానని ఆఫర్ చేయగా, విషయాన్ని కెయిన్స్‌కు చెప్పానని, కెయిన్స్ సైతం తనను ప్రోత్సహించాడని తెలిపాడు.

Dinesh Mongia, Indian middle man, prostitute in Lou Vincent’s testimony

కొంత మానసిక ఒత్తిడితో ఉన్న తాను వెంటనే ఆ గ్యాంగ్ లో చేరిపోయానని, మొత్తం నలుగురు సభ్యుల ఫిక్సింగ్ జట్టులో దినేష్ మోంగియా, న్యూజిలాండ్ ఫేస్ బౌలర్ డరైల్ టఫీ సభ్యులని విన్సెంట్ తెలిపాడు. అయితే విన్సెంట్ చేసిన ఆరోపణలను మోంగియా తీవ్రంగా ఖండించాడు.

విన్సెంట్ చెప్పింది అబద్ధమని, తానెప్పుడూ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. ఐసీఎల్ సమయంలో తాను చంఢీగఢ్ లయన్స్‌కు ఆడానని, జట్టులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఏం చేశారో తనకు తెలియదని మోంగియా అన్నాడు.

English summary
Former New Zealand opener Lou Vincent admitted he was involved in match-fixing under direct orders from Chris Cairns. Giving evidence at Southwark Crown Court in London where Cairns is on trial for perjury, Vincent said: “I was under direct orders from Chris Cairns to get involved in fixing in India.” Vincent, 36, said his descent to corruption began when he was dropped from the New Zealand team in 2007, and subsequently he suffered a meltdown.
మీ వ్యాఖ్య రాయండి