Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వద్దంటే భారత్‌కి గట్టి సమాధానం:పాక్ బోర్డుకి ఎహసాన్

Posted by:
Published: Tuesday, October 13, 2015, 15:13 [IST]

కరాచీ: ఈ ఏడాది డిసెంబర్ నెలలో తటస్థ వేదిక పైన పాకిస్తాన్ జట్టుతో సిరీస్ ఆడేందుకు బిసిసిఐ నిరాకరిస్తే... ఆ తర్వాత ఏ ఐసీసీ ఈవెంట్లలోను టీమిండియాతో ఆడవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి), పాక్ క్రికెట్ జట్టుకు ఐసీసీ మాజీ జీఫ్ ఎహసాన్ సూచించాడు.

Former ICC chief asks Pakistan to not play India in ICC events if December series is cancelled

ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహించుకునేందుకు ఐసీసీ చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఈ తరహాలో వారికి కూడా సమాధానం ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డుకు సూచించాడు. ఏదైనా ఐసీసీ టోర్నీలో భారత్‌తో ఆడమంటూ తిరస్కరించే హక్కు పాక్‌కు ఉందని చెప్పాడు.

ఈ టోర్నీలో భారత్ - పాక్ మ్యాచ్ నిర్వహిస్తే ఐసీసీకి మంచి ఆదాయమే లభిస్తుందని చెప్పాడు. భారత్ ఉన్న గ్రూపులో తమను చేర్చవద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి చెప్పాలని సూచించాడు. డిసెంబర్ సిరీస్‌ రద్దయితే పాక్ కూడా అంతే కటువుగా ఉండాలని ఆయన అభిప్రాయడ్డాడు.

English summary
Former ICC chief asks Pakistan to not play India in ICC events if December series is cancelled
మీ వ్యాఖ్య రాయండి