Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నా భార్యనే కారణం: సానియాపై షోయబ్ ప్రశంస

Posted by:
Published: Wednesday, October 14, 2015, 10:03 [IST]

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మళ్లీ పుంజుకోవడంలో తన భార్య సానియా మిర్జా పాత్ర ఎంతో ఉందని పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ చెప్పారు. ఇంగ్లాండ్‌తో ఆడుతున్న తొలి టెస్టులో సెంచరీ (123)కి తన భార్య సానియానే కారణమని చెప్పారు.

టెస్టు, టీ20ల్లో తన సక్సెస్ ఘనత సానియాకే దక్కుతుందని మాలిక్ తెలిపారు. ‘ఇటీవల టెన్నిస్‌లో సానియా విశేషంగా రాణిస్తోంది. ఆమె స్ఫూర్తితో నేనూ క్రికెట్‌ను సీరియన్‌గా తీసుకున్నా. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నా. ట్రైనింగ్‌ పట్ల నా దృక్పథం మారడానికి ఆమే కారణమ'ని మాలిక్‌ చెప్పారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్థాన్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన షోయబ్‌ మాలిక్‌ (230 బంతుల్లో 14 ఫోర్లతో 124 బ్యాటింగ్‌) అజేయ సెంచరీతో రాణించాడు.

Inspired by wife Sania Mirza, Shoaib Malik scores ton on Test return

షోయబ్‌ మాలిక్‌తో పాటు హఫీజ్‌ (98) రాణించడంతో.. తొలి రోజైన మంగళవారం ఆటముగిసే సమయానికి పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన పాక్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (2) వికెట్‌ కోల్పోయింది.

మాలిక్‌-హఫీజ్‌ రెండో వికెట్‌కు 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాక్‌ కోలుకుంది. అయితే హఫీజ్‌ 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ 124, షఫిక్ 11 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ టెస్టు సిరిస్ అబుదాబిలో జరుగుతుంది.

English summary
Hitting a patient century on Test comeback, former Pakistan captain Shoaib Malik today credited his wife Sania Mirza for his success in international cricket since his recall to the national side this year.
మీ వ్యాఖ్య రాయండి