Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనికి గవాస్కర్ బాసట: బలిపశువుని చేయొద్దు

Posted by:
Published: Wednesday, October 14, 2015, 11:51 [IST]

బెంగుళూరు: మూడు వరుస పరాజయాలతో విమర్శల పాలవుతున్న టీమిండియా వన్డే కెప్టెన్ ధోనికి బాసటగా నిలిచాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. పరాజయాలకు ధోనిని మాత్రమే విమర్శిస్తూ అతడిని బలిపశువును చేస్తున్నారని పేర్కొన్నాడు.

ప్రస్తుతం టోర్నమెంట్‌లో శిఖర్ ధావన్, రైనా, విరాట్ కోహ్లీ లాంటి ఆటగాళ్లు విఫలమవుతున్నా, బౌలర్లు పేలవ ప్రదర్శన చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు. ఓటిమికి మొత్తం బాధ్యత ధోనిదే అన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ధోని పట్ల ఓపికతో వేచి చూడాలి. ధోనిలో ఇంకా మూడు, నాలుగేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరిస్‌లో 0-2తో దక్షిమాఫ్రికా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Lay off MS Dhoni, don't make him a 'scapegoat': Sunil Gavaskar

ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన తొలి వన్డేలో ధోని సేన 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ధోనిపై క్రికెట్ విశ్లేషకులు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్, ధోనికి మద్దతుగా నిలబడటం కాస్తంత ఊరటనిచ్చే అంశం.

తన క్రికెట్‌ జీవితంలో అత్యంత క్లిష్టమైన, కఠిన పరీక్షను కెప్టెన్‌ ధోనీ ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న తరుణంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పాత్రపై ధోనీ ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో రెండో వన్డేలోనూ ధోనిపై అందరి దృష్టి ఉంది.

ఇక, దక్షిణాఫ్రికా దూకుడుని అడ్డుకున్న ఏకైక బౌలర్‌ అశ్విన్‌ లేకుండానే భారత్‌ మిగతా సిరీస్‌ ఆడనుంది. గాయం కారణంగా అశ్విన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అశ్విన్‌ స్థానంలో హర్భజన్‌ సింగ్ జట్టులోకి రానున్నాడు.

English summary
After 3 successive losses against South Africa, Indian captain MS Dhoni has come under heavy criticism. But former skipper Sunil Gavaskar has supported Dhoni and said the wicketkeeper-batsman still has 3 to 5 years of cricket left in him.
మీ వ్యాఖ్య రాయండి