Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సౌతాఫ్రికాతో మ్యాచ్: అంపైర్‌పై భారత్ గుర్రు, ఫిర్యాదు!

Posted by:
Published: Wednesday, October 14, 2015, 12:21 [IST]

కాన్పూర్: దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ అంపైర్‌గా వ్యవహరిస్తున్న వినీత్ కులకర్ణి పైన టీమిండియా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తొలి ట్వంటీ 20లో డుమిని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండు ఎల్బీ అప్పీళ్లను అంపైర్ తిరస్కరించాడు.

దీంతో పాటు తొలి వన్డేలో శిఖర్ ధావన్‌ను ఎల్బీగా ప్రకటించాడు. వీటిపై టీమిండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.. చేస్తోంది. రెండో వన్డేలో అతడు అంపైరింగ్ చేయవలసి ఉంది.

టెస్టు జట్టు ప్రైజ్‌మనీ రెండింతలు

ఐసీసీ మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. మహిళా క్రికెట్ పురోగభివృద్ధే ధ్యేయంగా ఆర్థికంగా మరింత అండగా నిలవడంతో పాటు టెస్ట్ టాప్ జట్లకు డబుల్ బొనాంజా రూపంలో ప్రైజ్‌మనీని పెంచుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేది వరకు టెస్ట్‌ల్లో తొలి స్థానంలో నిలిచిన జట్టుకు ఇప్పటి వరకు ఉన్న రూ. 3.25 కోట్లకు బదులు రెండింతల అధిక మొత్తంలో రూ. 6.50 కోట్లు దక్కనున్నాయి.

 Why Team India is miffed with umpire Vineet Kulkarni

టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలకు సహాయకంగా నిలిచే ఉద్దేశంలో భాగంగా ఐసీసీ గతేడాది తీసుకొచ్చిన టెస్ట్ క్రికెట్ ఫండ్ రూ. 45.50 కోట్లకు ఈ ప్రైజ్‌మనీ అదనంగా జట్లకు అందనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లోని అసోసియేట్ దేశాలతో పాటు అనుబంధ దేశాల బోర్డులకు నేరుగా నిధులు అందనున్నాయి.

2016-2023 మధ్యకాలంలో జరిగే ఆరు ఐసీసీ మహిళల ఈవెంట్లకు ఐదింతలు అధికంగా అంటే రూ.26 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇంగ్లండ్ వేదికగా 2017లో జరిగే ఐసీసీ మహిళల ప్రపంచ కప్ కోసం కేటాయించిన రూ.6.50 కోట్లతో కలిపి ఈ ప్రైజ్‌మనీ మొత్తాన్ని ఐసీసీ కేటాయించింది.

English summary
Why Team India is miffed with umpire Vineet Kulkarni
మీ వ్యాఖ్య రాయండి