Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీపైకి కత్తి దూస్తే..! కోహ్లీ కంటే బెటర్: ఫ్యాన్స్ ట్వీట్లు

Posted by:
Published: Thursday, October 15, 2015, 11:38 [IST]

ఇండోర్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒంటరి పోరాటం చేసి గెలిపించాడు. దీనిపై ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీకి ఇది అద్భుతమైన, మరిచిపోలేని ఇన్నింగ్స్.

రెండో వన్డేలో ధోనీ 92 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 247 పరుగులు చేస్తే అందులో రహానే(51) మినహా.. ఎవరూ ఆడలేదు. దీంతో, టెయిలెండర్లు.. ముఖ్యంగా హర్భజన్ సింగ్ తదితరులతో కలిసి ధోనీ గెలిపించాడు. దీంతో, ట్విట్టర్లో ధోనీ అభిమానులు పండుగ చేసుకున్నారు.

From Twitter: Fans celebrate as MS Dhoni hits 92* in 2nd ODI

ఇటీవలి కాలంలో వరుస ఓటముల నేపథ్యంలో పలువురు ధోనీ పైన విమర్శలు చేశారు. దీంతో, ధోనీలో ఒత్తిడి పెరిగింది. అయితే, ఇంత ఒత్తిడిలోను ధోనీ బుధవారం ఆడిన మ్యాచ్ అద్భుతం. కేవలం 104 పరుగులకే భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో ధోనీ అద్భుతంగా ఆడాడు.

దీంతో, ట్విట్టర్‌లో పలువురు స్పందించారు. ధోనీ మరోసారి మాయ చేశాడని, ఈ మ్యాచ్‌లో ధోనీ చేసిన ప్రతి రన్ విమర్శకులకు చెంప పెట్టు అని, విమర్శకులకు ధోనీ తన కూల్ స్టయిల్‌లో బుద్ధి చెప్పాడని, ఎవరు నమ్మినా నమ్మకపోయినా... కోహ్లీ కంటే ధోనీ ఎంతో ఉత్తమ క్రికెటర్ అని ట్విట్టర్లో అభిమానులు స్పందించారు.

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ... ఆట అంటే తేలిక కాదని, మనం తప్పులు చేస్తే కత్తులు దూయాలని చాలామంది ఎదురు చూస్తుంటారని, మేం బాగానే ఆడామని, కానీ స్థాయికి తగినట్లు ఆడామని చెప్పనని అన్నాడు. బ్యాటింగులో విఫలమై ప్రత్యర్థి ముందు తక్కువ లక్ష్యమే ఉంచినా కాపాడుకోగలమని బౌలర్లు నిరూపించారన్నాడు. స్పిన్నర్లు ప్రయోగాలకు పోకుండా తమ బలాల్నే నమ్ముకున్నారన్నాడు.

English summary
"Captain Cool" MS Dhoni hit an unbeaten 92 against South Africa in the 2nd ODI here at Holkar Stadium today and his fans celebrated and used the opportunity to slam the critics, on social media.
మీ వ్యాఖ్య రాయండి