Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బ్యాట్స్‌మన్‌లా: జహీర్‌కు సచిన్, సహచరుల విషెస్

Published: Thursday, October 15, 2015, 16:03 [IST]

ముంబై: రిటైర్మెంట్ ప్రకటించిన పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌పై మాజీ దిగ్గజాలతోపాటు సహచరులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన కూలెస్ట్ పేస్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. సవాళ్లను స్వీకరంచడంలో అతనెప్పుడూ ముందుండేవాడని తెలిపాడు.

చాలా సందర్భాల్లో అతను బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాడని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్‌లో నూతన అధ్యాయనాన్ని ప్రారంభిస్తున్న జహీర్.. ఇందులోనూ విజయవంతం అవుతాడని సచిన్ ట్వీట్ చేశాడు.

Tendulkar on Zaheer: A bowler who could out-think batsmen

రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ ఆనందంగా సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా జహీర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

‘జహీర్ ఉత్తమ బౌలర్. సహృదయుడు. నా సోదరుడికి మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. లవ్ యూ జకీ' అని హర్భజన్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

కాగా, ‘పర్ఫెక్ట్ జెంటిల్‌మెన్. బిగ్ బ్రదర్. సరైన నిర్ణయం తీసుకున్నాడు. గుడ్ లక్ ఫర్ న్యూ ఇన్నింగ్స్' అని సురేష్ రైనా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.

‘జహీర్ ఖాన్‌తో ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చింది. దేశం కోసం ఆడుతూ ఆటను ఆస్వాదించాం. అతడి క్రికెట్ కెరీర్ అద్భుతం' అని మాజీ టెస్ట్ ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.

‘అత్యుత్తమ ప్రతిభ చూపిన అద్భుత బౌలర్. అతడి భవిష్యత్ కెరీర్ బాగా సాగాలి' అని మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ట్వీట్ చేశాడు.

‘అద్భుతమైన కెరీర్ వెల్డన్ జాక్. ఐసిటిలో నీవు లేకుండా కష్టమే. నీవు ఎంతో తెలివైన ఫాస్ట్ బౌలర్. నాకు తెలుసు. భారత క్రికెట్‌కు ఎంతో చేశావు. ఇప్పుడే ప్రారంభమైన కొత్త జీవితం విజయవంతంగా సాగాలి' అని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. వీరితోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తదితర వర్తమాన, మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు జహీర్ ఖాన్‌కు అభినందనలు తెలిపారు.

English summary
Iconic Sachin Tendulkar and limited overs captain Mahendra Singh Dhoni today led the bandwagon of former and current cricketers praising Zaheer Khan, who ended his international career on Thursday (October 15).
మీ వ్యాఖ్య రాయండి