Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ గుడ్‌బై

Updated: Thursday, October 15, 2015, 16:24 [IST]

ముంబై: టీమిండియాకు గత కొంత కాలంగా దూరమైన సీనియర్ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా విరమణ తీసుకున్న ఈ పాస్ట్ బౌలర్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు.

కాగా, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి జహీర్ రిటైర్ అవుతున్నాడని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ముందే ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ ఇలా వుంది. 'జహీర్ ఖాన్ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. రిటైర్మెంట్ తర్వాత అతడి కెరీర్ బాగా సాగాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ శుక్లా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Zaheer Khan announces international retirement

2002 నుంచి జహీర్ ఖాన్ తన ఫేవరేట్ బౌలర్ అని పేర్కొన్నారు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నీలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్‌గా నిలిచాడు.

2000లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో అరంగ్రేటం చేశాడు జహీర్. 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు. 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు. 17 టి20 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడుతున్నాడు.

Story first published:  Thursday, October 15, 2015, 13:11 [IST]
English summary
India seamer Zaheer Khan has announced his retirement from international and first-class cricket. He will, however, continue to play in the IPL for one more season.
మీ వ్యాఖ్య రాయండి