Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కోచ్‌గా మళ్లీ కిర్‌స్టన్, సంప్రదించిన బిసిసిఐ

Posted by:
Published: Friday, October 16, 2015, 13:15 [IST]

ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మళ్లీ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్‌స్టన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ఇప్పటికే ఆయనను సంప్రదించింది. ఆయన 2008 నుంచి 2011 వరకు భారత జట్టు కోచ్‌గా వ్యవహరించారు.

స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో భారత్ కప్‌ను సొంతం చేసుకునే దిశగా ఆయన భారత జట్టును నడిపించాడు. 2011 ఏప్రిల్ 2వ తేదీన వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో భారత్ విజయం సాధించిన తర్వాత ఆయన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు.

BCCI dials Gary Kirsten's number, asks South African to coach India again

ఆ తర్వాత ఆయన దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు 2013 జులై వరకు కోచ్‌గా వ్యవహరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) డేర్ డెవిల్స్ జట్టుకు 2014, 2015ల్లో ఇంచార్జీగా వ్యవహరించారు. కోచ్‌గా రావాలని తనకు బిసిసిఐ ఫోన్ చేసి అడిగినట్లు గ్యారీ కిర్‌స్టన్ చెప్పారు.

ఒకటి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని, అయితే తాను నిర్ణయం తీసుకునే స్థితిలో లేనని ఆయన ముంబై మిర్రర్ పత్రికతో చెప్పారు. అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించడం గౌరవప్రదమైన విషయమని ఆయన అన్నారు.

English summary
Former South Africa opener Gary Kirsten could return as India's coach as the Board of Control for Cricket in India (BCCI) have approached him.
మీ వ్యాఖ్య రాయండి