Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫిక్సింగ్‌లోకి..: కెయిన్స్‌పై మెక్‌కుల్లం బాంబు

Posted by:
Published: Friday, October 16, 2015, 12:27 [IST]

లండన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కుల్లం సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను మ్యాచ్‌ ఫిక్సింగ్‌లోకి లాగేందుకు ప్రయత్నం జరిగిందని ఆయన కోర్టుకు వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్స్ తనను అడిగాడని చెప్పాడు.

2008 ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా కోల్‌కతాలోని ఓ హోటల్‌లో కలిసినప్పుడు తనను ఫిక్సింగ్‌లోకి లాగేందుకు కెయిన్స్ ప్రయత్నించాడని చెప్పాడు. అయితే, అతని ప్రతిపాదనను తాను అంగీకరించలేదని చెప్పాడు. కెయిన్స్ ప్రతిపాదనపై తాను షాక్‌కు గురైనట్లు తెలిపాడు. ఫిక్సింగ్ చేయాలని అదే ఏడాది తనను రెండు సార్లు కెయిన్స్ కోరినట్లు తెలిపాడు.

Chris Cairns made match-fixing approach in a Kolkata hotel during IPL: Brendon McCullum

స్పాట్ ఫిక్సింగ్‌ గురించి పేపర్‌పై రాసి మరీ వివరించాడని మెక్‌కుల్లం చెప్పాడు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్‌కు 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశపెట్టినట్లు కూడా ఆరోపించాడు. ఫిక్సింగ్ సొమ్ముతో కెయిన్స్ న్యూజిలాండ్‌లో ఆస్తులు కూడబెట్టాడని చెప్పాడు. కెయిన్స్ వ్యవహారంపై 2011లో అవినీతి నిరోధక విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపాడు.

కెయిన్స్ ఫిక్సింగ్ చేయాలని అడిగినప్పుడు జోక్ చేస్తున్నాడని అనుకున్నానని, అయితే అతను సీరియస్‌గానే అడుగుతున్నాడని తర్వాత అర్థమైందని, ప్రతి ఒక్కరూ అదే పనిచేస్తున్నారని చెప్పాడని, నువ్వెందుకు వెనకాడుతున్నావని కెయిన్స్ అన్నాడని మెక్‌కుల్లం వివరించాడు.

English summary
Former New Zealand captain Chris Cairns approached current skipper Brendon McCullum with a "business proposition" about match-fixing, McCullum told a London court on Thursday.
మీ వ్యాఖ్య రాయండి