Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అనుచిత వ్యాఖ్య: టీమిండియ్ మేనేజర్‌కు జరిమానా

Posted by:
Published: Friday, October 16, 2015, 12:33 [IST]

ఇండోర్: భారత క్రికెట్ జట్టు మేనేజర్ వినోద్ పాడ్కేకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అతనికి జరిమానాను విధించింది.

మైదానంలో అంపైర్ల నిర్ణయాలపై ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. మైదానం వెలుపల జట్టు బాగోగులు చూసుకునేందుకు వెళ్లే మేనేజర్‌కు కూడా మ్యాచ్ కోత పడటం గమనార్హం.

India team manager fined for 'inappropriate comments'

ఆటగాళ్ల వసతి, భోజన సౌకర్యాలతో పాటు ప్రయాణ ఏర్పాట్లు తదితరాలను చూసేందుకు జట్టు వెంట మేనేజర్ ఉంటాడు. ఆటతో సదరు పదవిలో ఉండే వ్యక్తికి అంతగా సంబంధం ఉండదు. అయితే భారత క్రికెట్ జట్టు మేనేజర్ ఫడ్కే మాత్రం అంపైర్ గురించి మాట్లాడాడు.

ఫ్రీడం సిరీస్‌లో భాగంగా ఇటీవల జరిగిన వన్డేకు సంబంధించి అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయంపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెబుతున్నారు. తటస్థంగా ఉండే అంపైర్లపై ఆటగాళ్లే కాదు, ఎవరు నిందలు వేసినా సహించేది లేదన్న ఐసీసీ, ఫడ్కేకు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాను హద్దు మీరలేదన్న ఫడ్కే వాదనను కొట్టిపారేసిన ఐసీసీ... మ్యాచ్ ఫీజులో కోత విధించింది.

English summary
Indian team manager Vinod Phadke has been fined 40% of his match fee by the International Cricket Council for making "inappropriate comments" on a number of contentious umpiring decisions by Vineet Kulkarni, following India's loss to South Africa in the first ODI in Kanpur on Sunday.
మీ వ్యాఖ్య రాయండి