Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కుక్ డబుల్ సెంచరీ: 836నిమిషాలతో రికార్డ్

Published: Saturday, October 17, 2015, 15:30 [IST]

అబుదాబి: ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ తొలి టెస్టు డ్రాగా ముగిసింది. కెప్టెన్‌ కుక్‌ (263; 528 బంతుల్లో 18X4) డబుల్‌ సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు సాధించింది. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లకు 569 పరుగులు చేసి 46 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఐదో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 598 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన పాక్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 523/8కి డిక్లేర్ చేసింది.

అంతకుముందు నాలుగోరోజు ఓవర్‌నైట్‌ స్కోరు 290/3తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ అదే జోరుతో ఆడింది. వ్యక్తిగత స్కోరు 168తో బ్యాటింగ్‌ మొదలెట్టిన కుక్‌ అలవోకగా డబుల్‌ సెంచరీ పూర్తి చేశాడు. రూట్‌ (85)తో నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించాడు.

Alastair Cook bats for record 836 minutes, scores an epic 263

ఆ తర్వాత స్టోక్స్‌ (57)తో ఆరో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కుక్‌ ఏడో వికెట్‌ రూపంలో నిష్క్రమించాడు. రషీద్‌ (6), బ్రాడ్‌ (0) క్రీజులో ఉన్నారు. మొత్తం 836 నిమిషాలు క్రీజులో నిలిచిన కుక్‌ టెస్టు క్రికెట్లో మూడో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడిన ఆటగాడిగా ఘనత సాధించాడు.

పాకిస్థాన్‌కు చెందిన హనీఫ్‌ మహ్మద్‌ (970 నిమిషాలు; 1958లో విండీస్‌పై), దక్షిణాఫ్రికా ఆటగాడు గారీ కిర్‌స్టెన్‌ (870; 1999లో ఇంగ్లాండ్‌పై) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

English summary
England captain and opening batsman Alastair Cook batted for a record 836 minutes (4 minutes short of 14 hours) and scored 263 (528 balls, 18x4)) against Pakistan on the 4th day of their 1st Test here. The left-hander's marathon innings was the third longest in Test history.
మీ వ్యాఖ్య రాయండి