Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సత్తాచాటిన యువరాజ్: 'సిక్స్'తో సెంచరీ కొట్టాడు

Posted by:
Published: Sunday, October 18, 2015, 12:38 [IST]

మొహాలీ: భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. గ్రూప్-బి లీగ్‌లో భాగంగా గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య మొహాలీలో జరుగుతున్న మ్యాచ్‌లో యువరాజ్ చెలరేగిపోయి ఆడాడు.

151 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో సెంచరీ కొట్టాడు. తన సెంచరీని ఓ భారీ సిక్సర్‌తో యువరాజ్ పూర్తి చేశాడు. యువరాజ్ మొత్తం 187 పరుగులు చేయడం, మనన్ వోహ్రా 104 పరుగులతో రాణించడంతో పంజాబ్ జట్టు 608 పరుగులు చేసి పటిష్ఠ స్థితికి చేరుకుంది.

Ranji Trophy: Yuvraj Singh smashes 187 as Punjab take 1st innings lead

ఈ మ్యాచ్ లో గుజరాత్ 467 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ పైన పంజాబ్ 141 పరుగుల ఆధిక్యంతో) ఉంది. యువరాజ్, వోహ్రాలతో పాటు మన్ దీప్ సింగ్ (63), కౌల్ (74) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో, పంజాబ్ పటిష్ట స్థితిలో నిలిచింది.

English summary
Left-hander Yuvraj Singh reminded the selectors and his fans that he still has a lot of cricket left in him as he smashed a superb 187 for Punjab against Gujarat in their Ranji Trophy match here on Sunday.
మీ వ్యాఖ్య రాయండి