Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కొత్తేం కాదు, రాజకీయాలొద్దు: శివసేన ధర్నాపై ఐసీసీ

Posted by:
Published: Monday, October 19, 2015, 14:23 [IST]

దుబాయ్: ఇండో - పాక్ సిరీస్ కోసం చర్చిస్తామని బిసిసిఐ అధ్యక్షుడు మనోహర్ శశాంక్ ప్రకటన, చర్చల సందర్భంగా శివసేన కార్యకర్తలు ముంబైలోని బిసిసిఐ కార్యాలయాన్ని ముట్టడించారు. దీనిపై ఐసీసీ చీఫ్ జహీర్ అబ్బాస్ అసహనం వ్యక్తం చేశాడు.

క్రికెట్‌ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని చెప్పాడు. భారత్‌-పాక్‌ల మధ్య డిసెంబరులో జరగాల్సి ఉన్న ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌ విషయమై ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్యా సోమవారం ముంబైలో సమావేశం జరగాల్సి ఉంది. ఈ విషయమై ముంబయిలో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అది రేపటికి వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో అబ్బాస్‌ స్పందించాడు. జహీర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఆందోళనల్లో కొత్తేమీ లేదని ఎప్పుడూ జరుగుతూ ఉండేవేన్నాడు. అయితే ఐసీసీ అధ్యక్షుడుగా తాను క్రికెట్‌ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలనకుంటున్నానని చెప్పాడు.

ICC President Zaheer Abbas Disappointed With Shiv Sainiks Protest

రాజకీయం, క్రికెట్‌ పూర్తిగా వేరన్నాడు. తాము భారత్‌ని పాకిస్థాన్‌కి వచ్చి క్రికెట్‌ సిరీస్‌ ఆడమనడం లేదని తటస్థ వేదిక పైనే ఆడమంటున్నామని చెప్పాడు. భారత్‌-పాక్‌ల క్రికెట్‌ సిరీస్‌పై మంచి కబురు కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందన్నాడు. కాగా, అబ్బాస్‌ పాకిస్తాన్ మాజీ క్రికెటర్.

దాడులు సరికాదు: బిసిసిఐ

దాడులు సరికాదని బిసిసిఐ పేర్కొంది. ఇండో పాక్ మ్యాచ్ చర్చలపై శివసేన నిరసన సరికాదన్నారు. పాకిస్తాన్‌తో చర్చలు కొనసాగుతాయని రాజీవ్ శుక్లా చెప్పాడు. ఎవరైనా నిరసనలు వ్యక్తం చేయవచ్చునని, దాడులు సరికాదని బిజెపి నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు.

English summary
ICC President Zaheer Abbas Disappointed With Shiv Sainiks Protest
మీ వ్యాఖ్య రాయండి