Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్న కెప్టెన్ ధోని

Posted by:
Published: Monday, October 19, 2015, 14:42 [IST]

రాజ్‌కోట్: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా అక్టోబర్ 18 (ఆదివారం)నాడు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రికార్డుని అధిగమించాడు.

రాజ్‌కోట్ వేదికగా నిన్న (ఆదివారం) భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్‌సీఏ) మైదానంలో తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయి 270 పరుగులు సాధించింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో 1-2తో టీమిండియా వెనుకబడింది. అయితే ఈ మ్యాచ్‌లో 47 పరుగులు చేసిన టీమిండియా వన్డే కెప్టెన్ ధోని వ్యక్తిగతంగా ఈ రికార్డుని సాధించాడు.

India captain MS Dhoni achieves yet another milestone

వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆస్టేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొదటి స్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్లెమింగ్‌ను ధోని అధిగమించి రెండో స్ధానానికి ఎగబాకాడు.

2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోని, ఇప్పటి వరకు కెప్టెన్‌గా 184 వన్డే మ్యాచ్‌లాడిన ధోని 6,313 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా అందులో 6 సెచంరీలు, 46 అర్ద సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్‌గా చూస్తే 268 వన్డే మ్యాచ్‌లాడిన ధోని 52.63 సగటుతో 9 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలు చేశాడు.

కెప్టెన్‌గా వన్డే పరుగులు సాధించిన ఆటగాళ్లు (టాప్ 5)

* 8,497 runs (230 matches) - Ricky Ponting (Australia)
* 6,313 (184) - MS Dhoni (India)
* 6,295 (218) - Stephen Fleming (New Zealand)
* 5,608 (193) - Arjuna Ranatunga (Sri Lanka)
* 5,416 (150) - Graeme Smith (South Africa)

English summary
India's ODI captain MS Dhoni achieved yet another milestone in his glittering international career when he surpassed former New Zealand skipper Stephen Fleming during the 3rd ODI against South Africa here last night (October 18).
మీ వ్యాఖ్య రాయండి