Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆ స్థానాల కోసం వెతుకులాట: చేతులెత్తేయడంపై ధోనీ

Posted by:
Published: Monday, October 19, 2015, 10:34 [IST]

రాజ్ కోట్: ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో సమర్థంగా ఆడే బ్యాట్స్‌మెన్ కోసం తమ అన్వేషణ కొనసాగుతూనే ఉందని, బ్యాటింగ్ వరుసలో మార్పులు చేస్తుంటే కొందరు విఫలమవుతున్నారని భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మూడో వన్డే ఓటమి అనంతరం చెప్పాడు.

మూడో స్థానంలో అజింక్యా రహానే రాణించాడని చెప్పాడు. అలాగే నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని చెప్పాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పాడు. లక్ష్యం చేదించదగ్గదే అయినా పిచ్ నెమ్మదించడంతో భారీ షాట్లు ఆడటం కష్టమైందని చెప్పాడు.

ఏ స్థానంలో ఏ బ్యాట్సుమెన్ ఫిట్ అవుతారో తెలియడం లేదని ధోనీ నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా కూడా చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేదని చెప్పాడు. అందుకు పిచ్ కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా మూడో వన్డేలో భారత్.. దక్షిణాప్రికా చేతిలో ఓడింది.

English summary
India captain MS Dhoni again expressed his helplessness about still not being able to find out which of his batsmen can fit in the middle order and finish games in close run chases.
మీ వ్యాఖ్య రాయండి