Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

శివసేన వార్నింగ్: పాక్ అంపైర్, అక్రం, అక్తర్‌ల భద్రతపై చేతులెత్తేశారు

Posted by:
Updated: Tuesday, October 20, 2015, 11:31 [IST]

దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ (ఐసీసీ) సోమవారం నాడు భారత్ - దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి పాకిస్తాన్ అంపైర్‌ను వెనక్కి తీసుకుంది. శివసేన హెచ్చరికల నేపథ్యంలో ఐసీసీ పాక్ అంపైర్‌ను వెనక్కి తీసుకుంది.

భారత్ - పాక్ సిరీస్ కోసం బిసిసిఐ - పిసిబి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చర్చలు జరిపేందుకు సోమవారం ప్రయత్నించారు. దీంతో, ముంబైలోని బిసిసిఐ కార్యాలయానికి శివసేన వెళ్లి అడ్డుకుంది. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌ను నిలదీసింది.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా - భారత్ మ్యాచుల కోసం ఉన్న పాక్ అంపైర్‌ను ఐసీసీ వెనక్కి తీసుకుంది. పాక్‌కు చెందిన అలిమ్ ధర్ ఐసీసీ ఎంపైర్ ప్యానెల్ మెంబర్. అతను తొలి మూడు వన్డేలకు ఉన్నాడు. ఈ నెల 22న చెన్నైలో జరిగే నాలుగో వన్డే, 25న ముంబైలో జరిగే ఐదో వన్డేకు కూడా షెడ్యూల్ ప్రకారం ఉన్నాడు.

ICC withdraws Pakistan umpire Aleem Dar from India-South Africa ODI series

అయితే, ముంబైలో శివసేన బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి పిసిబితో చర్చలు అడ్డుకునే ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో పాక్‌కు చెందిన అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకుంది.

కాగా, భారత్ - పాకిస్తాన్ సిరీస్ అంశంపై ఈ రోజు (మంగళవారంనాడు) ఢిల్లీలో చర్చలు జరిగే అవకాశముందని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో అలిమ్ ధర్‌ను వెనక్కి తీసుకొని, ఆయన స్థానంలో మరొక ఎంపైర్‌ను నిర్ణయిస్తామన్నారు.

పాక్ కామెంటేటర్లకూ భద్రత ఇవ్వలేం

ముంబైలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆఖరి వన్డే పోరులో పాక్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత కామెంటేటర్లు వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్‌లు కనిపించరు.

వీరికి భద్రత కల్పించలేమని, అవాంఛిత ఘటనలు జరగవచ్చని భద్రతా అధికారులు చెప్పడంతో.. చెన్నైలో జరిగే నాలుగో వన్డే తర్వాత వీరిద్దరూ పాకగ్ పయనం కానున్నారు. ఈ విషయాన్ని అక్రం ఏజెంట్ ఆర్సలన్ హైడర్ స్పష్టం చేశారు. ముంబై వన్డేకు రెండు రోజుల ముందుగానే 23న వీరు పాకిస్థాన్‌కు పయనం అవుతారు.

Story first published:  Tuesday, October 20, 2015, 9:03 [IST]
English summary
The ICC today withdrew Pakistan umpire Aleem Dar from officiating in the remaining two matches of the ongoing one-day series between India and South Africa in the wake of Shiv Sena gheraoing BCCI chief Shashank Manohar forcing cancellation of talks with PCB chief Shaharyar Khan.
మీ వ్యాఖ్య రాయండి