Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇలాగైతే పాక్ క్రికెటర్లు భారత్‌కు రాకపోవచ్చు: అబ్బాస్

Published: Tuesday, October 20, 2015, 11:05 [IST]

కరాచీ: క్రికెట్‌ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని (అంతర్జాతీయ క్రికెట్ మండలి)ఐసీసీ అధ్యక్షుడు జహీర్‌ అబ్బాస్‌ అన్నారు. పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ భారత్‌కు కేవలం ద్వైపాక్షిక సిరీస్ కోసం చర్చించేందుకోసం వస్తేనే శివసేన కార్యకర్తలు ఇంత రచ్చ చేస్తే, మరి క్రికెట్ ఆడేందుకు ఆ జట్టు వస్తే? ఈ భయాన్నే వ్యక్తం చేశాడు పాకిస్థాన్‌కు చెందిన ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్.

పరిస్థితులు ఇలాగే ఉంటే వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ కోసం పాక్ ఆటగాళ్లూ రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులు మెరుగుపరిచేందుకు పాక్, భారత్ క్రికెట్ బోర్డులు కృషి చేయాలన్నాడు.

లేదంటే భద్రతా కారణాల వల్ల పాక్ ఆటగాళ్లూ భారత్‌లో పర్యటించేందుకు అంగీకరించరేమోనని భయం కలుగుతోందని అన్నాడు. రాజకీయం, క్రికెట్.. రెండూ వేర్వేరు అంశాలని.. రెండింటినీ కలిపి చూడకూడదని తెలిపాడు. ‘పిసిబి భారత్‌ను పాక్‌కు వచ్చి ఆడాల్సిందిగా పీసీబీ కోరడం లేదు. తటస్థ వేదికపైనే సిరీస్ నిర్వహించాలనుకుంటోంది' అని తెలిపాడు.

Pakistan players may refuse to tour India for World T20, Zaheer Abbas

‘యావత్ ప్రపంచం ఇరుదేశాల క్రికెట్ కోసం వేచి చూస్తోంది. ఇండో-పాక్ క్రికెట్ కంటే మజా అయింది ఇంకోటి లేదు. భారత్ శుభవార్త తెలియజేస్తుందని ఆశిస్తున్నా' అని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్బాస్ పేర్కొన్నాడు.

పాక్‌తో సిరీస్ ఇప్పట్లో లేనట్లే

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో సిరీస్‌కు అంగీకరించవద్దంటూ శివసేన కార్యకర్తలు బిసిసిఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి తెలిపిన నిరసనను ఖండిస్తూనే, ద్వైపాక్షిక సిరీస్ ఇప్పట్లో లేనట్టేనని సంకేతాలిచ్చాడు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాకే సిరీస్‌ల పునురుద్ధరణ ఉంటుందని, అయితే దీనికి ఎంతకాలం పడుతుందో చెప్పడం కష్టమని తెలిపాడు.

English summary
Citing the incident of Shiv Sena activists storming the BCCI headquarters in Mumbai protesting against the resumption of bilateral cricket series between the arch-rivals, the ICC president Zaheer Abbas on Monday said he feared for Pakistan players' security during the World T20 in India next year.
మీ వ్యాఖ్య రాయండి