Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆశ్చర్యపోలేదు, సానుభూతి: యువరాజ్‌పై గవాస్కర్

Posted by:
Published: Tuesday, October 20, 2015, 10:36 [IST]

ముంబై: జట్టులోకి యువరాజ్ సింగ్‌ను విస్మరించడంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సోమవారం నాడు స్పందించాడు. యువీని ఎంపిక చేయకపోవడంపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, కానీ అతనిని తీసుకోకపోవడంపై ఆశ్చర్యం లేదన్నాడు.

యువీ 2015 ప్రపంచ కప్‌కు ఎంపిక కాలేదు. తాజాగా అతడికి అవకాశం ఇవ్వకపోవడం పైన స్పందించాడు. ఇది తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదన్నాడు. రంజీ ట్రోఫీలో యువరాజ్‌ భారీ శతకం (187) సాధించిన విషయం తెలిసిందే. అయినా సెలక్టర్లు అతడిని పట్టించుకోలేదు.

Yuvraj Singh Deserved One Last Chance for India: Sunil Gavaskar

2015 ప్రపంచ కప్‌కు ఎంపిక చేయనప్పుడే సెలక్టర్లు యువరాజ్‌కు తమ ఉద్దేశాన్ని తెలిపారని, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామన్న భావాన్ని వ్యక్తం చేశారని, కానీ రంజీల్లో ప్రదర్శన తర్వాత మళ్లీ భారత జట్టులో అతడికి చోటు దక్కుతుందేమోనన్న ఆశ కలిగిందన్నాడు.

కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో మంచి మేళవింపుతో జట్టును ఎంపిక చేయాలన్నది తన ఉద్దేశం అన్నాడు. ఐదో స్థానంలో మనకు సరైన ఆటగాడు లేడని, ఆ స్థానంలో యువీ అనుభవం ఉపయోగపడుతుందన్నాడు. దాదాపు పదేళ్లుగా జట్టులో ఉంటున్న సురేష్ రైనాను అనుభవజ్ఞుడు కాదని అనలేమని, కానీ ఆ స్థానంలో యువరాజ్‌ వస్తే ఎంతో ప్రభావం ఉంటుందన్నాడు. అతడికి అవకాశం రానందుకు విచారంగా ఉందన్నాడు.

English summary
Yuvraj Singh's name was being discussed as the national selectors on Monday picked the Indian team for the last two ODIs against South Africa. Former Test great Sunil Gavaskar felt Yuvraj was still a good bet.
మీ వ్యాఖ్య రాయండి