Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నేను బెదిరించలేదు, వెళ్లిపోతున్నా: పాక్ షహర్యార్

Posted by:
Published: Wednesday, October 21, 2015, 11:21 [IST]

ఢిల్లీ: భారత్ పాక్ సిరీస్‌కు బిసిసిఐ ముందుకు రాకుంటే తాము రానున్న ప్రపంచ ట్వంటీ 20లో భారత్‌తో ఆడేది లేదని తాను వ్యాఖ్యానించలేదని పిసిబి చైర్మన్ షహర్యార్ ఖాన్ మంగళవారం నాడు చెప్పాడు. సిరీస్ లేకుంటే తాము భారత్‌తో ఐసీసీ వేదికల్లో ఆడేది లేదని గతంలో షహర్యార్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు అతను తాను అలా వ్యాఖ్యానించలేదని చెప్పాడు. మరోవైపు, బిసిసిఐతో చర్చల కోసం పిలవడాన్ని ఆయన స్వాగతిస్తూనే... నిరీక్షణలో ఉంచడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

బీసీసీఐ ఆహ్వానం మేరకు షహర్యార్ ఖాన్ భారత్ వచ్చాడు. అయితే, ఆయనకు శివసేన రూపంలో అవాంతరం ఎదురైంది.

ముంబైలోని బిసిసిఐ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన శివ సైనికులు... పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో భారత్ - పాక్ సిరీస్ గురించి చర్చించవద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చర్చలు వాయిదా పడుతున్నాయి. షహర్యార్ ఖాన్ ఢిల్లీలో ఉన్నాడు.

Never threatened to boycott World Twenty20 in India: Shaharyar Khan

దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ముంబైలో ఉంది. దీంతో బీసీసీఐ వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో షహర్యార్ ఖాన్ మాట్లాడుతూ... భారత్‌కు వచ్చి రెండు రోజులైనా ఆశించిన స్పందన లేదని అభిప్రాయపడ్డాడు. తాను తిరిగి పాకిస్తాన్ వెళ్తున్నట్లు చెప్పాడు.

అయితే, క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీసీఐ తనను భారత్‌కు పిలిపించడం సంతోషదాయకమని తెలిపాడు. బీసీసీఐపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నాడు. దక్షిణాఫ్రికాతో నాగపూర్ టెస్టు ముగిసిన తర్వాత పీసీబీని మరోసారి చర్చలకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరద్ పవార్‌లను షహర్యార్ ఖాన్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

English summary
A miffed Pakistan Cricket Board chairman Shaharyar Khan on Tuesday conceded that the prospects of an Indo-Pak bilateral cricket series are "very low" as "pressures" were preventing the BCCI from taking any initiative on the issue.
మీ వ్యాఖ్య రాయండి