Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇక నుంచి రెండేళ్లపాటు ‘వివో’ ఐపిఎల్: బిసిసిఐ

Published: Wednesday, October 21, 2015, 16:58 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) స్పానర్స్‌గా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వివో వ్యవహరించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) బుధవారం ప్రకటించింది. సమగ్రమైన బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడంతో బిసిసిఐ.. వివోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

వచ్చే ఐపిఎల్ నుంచి రెండేళ్లపాటు వివో స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. 2016, 2017 ఐపిఎల్‌ టోర్నీలకు వివో ప్రచారం, సహకారం అందించనుంది.

ఈ సందర్భంగా ఐపిఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘వచ్చే రెండేళ్లపాటు ఐపిఎల్ టోర్నీలకు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు వివో ముందుకు రావడం అభినందనీయం. ఐపిఎల్ ఇప్పట్నుంచి వివో ఐపిఎల్‌గా పిలవబడుతుంది. ప్రపంచంలోని వివో ఎంతో ఆధునాతన మొబైల్ ఫోన్లను తయారు చేస్తోంది. వారు ఐపిఎల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తారని అనుకుంటున్నా' అని తెలిపారు.

Vivo confirmed as IPL title sponsor for 2 years

బిసిసిఐ గౌరవ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘వివోకు ఐపిఎల్ స్వాగతం పలుకుతోంది. ఐపిఎల్‌లో అవకాశాలకు, ప్రతిభ ప్రదర్శనకు లోటులేదు. వివో కూడా ఈ రెండింటికీ సంకేతం. ఐపిఎల్ మాదిరిగానే చాలా తక్కువ కాలంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగింది. స్పాన్సర్‌షిప్ రెండు వర్గాలకు లాభదాయకమే' అని చెప్పారు.

వివో మొబైల్ ఇండియా సిఈఓ అలెక్స్ ఫెంగ్ మాట్లాడుతూ.. ‘వివో భారతదేశంలో ఇప్పుడిప్పుడే మార్కెట్‌ను విస్తరించుకుంటోంది. సంగీత ప్రియులు, క్రీడాకారులు, ఫ్యాషన్ ప్రియులకు అవసరమైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు మా సంస్థ సిద్ధంగా ఉంది' అని తెలిపారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న కార్యక్రమాలతో ప్రతిభకు మద్దతిస్తున్నాం. ఈ పెట్టుబడులు భారతదేశం తమకు మార్కెట్ పరంగా ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఐపిఎల్‌కు పెట్టిన మొత్తం మళ్లీ మాకు వస్తుందని అనుకుంటున్నాం. ‘లవ్ ఇండియా, లవ్ వివో ఇనిషియేటివ్' నినాదానికి ఈ ఒప్పందం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది' అని అలెక్స్ తెలిపారు.

English summary
The Board of Control for Cricket in India (BCCI) today announced its association with vivo, the premium global smartphone manufacturer, for title sponsorship of the Indian Premier League (IPL). vivo fulfilled their obligation of presenting the bank guarantee to the BCCI and confirmed the title sponsorship rights.
మీ వ్యాఖ్య రాయండి